ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఏపీ పోలీస్‌కు తొలిస్థానం

Spread the love

ఢిల్లీ: ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విభాగంలో దేశంలోనే ఏపీ తొలిస్థానాన్ని సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. స్మార్ట్ పోలీసింగ్ సర్వే 2021ని ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ విడుదల చేసింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించారు. పలు అంశాల్లో తెలుగు రాష్టాలకు ప్రథమ, ద్వితీయ స్థానాలు లభించాయి. స్మార్ట్ పోలీసింగ్ అన్ని అంశాల్లో ఏపీకి తొలి స్థానం, తెలంగాణకు రెండో స్థానం లభించింది. పోలీసు సెన్స్టివిటీ, సత్ ప్రవర్తనలో తెలంగాణ పోలీసుకు మొదటి స్థానం లభించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్, సాంకేతికతలో ఏపీ తొలిస్థానాన్ని సంపాదించుకుంది. సాంకేతికతను వాడుకోవడంలో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. అవినీతి రహిత సేవల్లో కేరళ పోలీసింగ్‌కు మొదటిస్థానం, ఏపీకి రెండోస్థానం, మూడోస్థానంలో తెలంగాణ నిలిచాయి. జవాబుదారీతనం ప్రజల్లో విశ్వాసం విభాగంలో ఏపీకి తొలిస్థానం, తెలంగాణకు రెండోస్థానం లభించాయి.

Leave a Reply