Suryaa.co.in

Andhra Pradesh

వ్యవసాయ వృద్ది రేటులో దేశంలోనే 6 వ స్థానంలో ఏపీ

ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్ 14, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -6.5% ప్రతికూల వ్యవసాయ వృద్ధి రేటు నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 8.2% పెరుగుదల నమోదు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు అంశాలపై స్పందించారు. చంద్రబాబు హయాంలో 2018-19 సంవత్సరంలో వ్యవసాయ వృద్దిరేటులో దేశంలో 27వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021-22 లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏకంగా 6వ స్థానానికి ఏగబాకిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలన్నప్రశ్నకు ఇదో సమాధానమని అన్నారు.

బీజేపీ అభ్యర్దికి పురందేశ్వరి ఓటు వేయలేదా?

కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజేపీకి పడిన 6 ఓట్లలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఓటు ఉందా అన్న అనుమానం వ్యక్తమవుతోందని ఆమె పార్టీకే చెందిన అభ్యర్దికి పురందేశ్వరి ఓటు వేయలేదేమోనని అనిపిస్తోందని అన్నారు. బావ పక్షాన పక్షపాతి కావడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆమెకు కంటగింపు అయిపోయిందని అన్నారు. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికొదిలేసి ఆమె ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే తన ఓటు అక్కడ లేదని, వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయిందని అబద్దాలు చెప్పి తప్పించుకోగల నేర్పరి పురందేశ్వరి అని అన్నారు.

బాలలే దేశ భవిత

బాలలే దేశానికి భవిష్యత్తు అని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బాలల ఉజ్వల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలూ శ్రమిస్తున్నారని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని, విద్యార్థులు నమోదు శాతం పెంచారని, బలమైన ఆహారం అందిస్తున్నారని, లెర్నింగ్ మెథడ్స్ బలోపేతం చేయడంతో పాటు అనేక చర్యలు చేపట్టారని విజయసాయి రెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE