Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ కు మరో ఇద్దరు సభ్యుల నియామకం

అమరావతి, ఆగష్టు10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం క్రొత్తగా బత్తుల పద్మావతి (ప్రకాశం జిల్లా), ముదిమాల లక్ష్మీదేవి (కడప జిల్లా) లను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ సభ్యులుగా నీయమించడం జరిగింది. ఈ ఏడాది ఏప్రియల్‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల కమీషన్‌కు ఒక చైర్మన్‌ ను, ముగ్గురిని సభ్యులుగా నీయమించడం జరిగింది. ఈ నెల 8వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరిని కమీషన్‌ సభ్యులుగా నీయమించడంతో మొత్తం సభ్యులు సంఖ్య ఆరుగురుకి చేరింది. వీరు ఇద్దరు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ కార్యాలయం లో కమీషన్ కార్యదర్శి శ్రీనివాస్ అధ్వర్యంలో తమ పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ కార్యక్రంలో కమీషన్ సబ్యులు రాజేంద్ర మరియు కమీషన్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

బత్తుల పద్మావతి: ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేస్తున్న  పద్మావతి గతంలో ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ కమిటి సభ్యులుగాను, ఆతర్వాత బాలల న్యాయమండలి సభ్యులుగా, షుమారు 12 సంవత్సరాలుగా బాలల సంక్షేమం, అభివృద్ధి , రక్షణ కోసం కృషి చేశారు. వీరి సేవలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బత్తుల పద్మావతిని రాష్ట్ర బాలల హక్కుల సరిరక్షణ కమీషన్‌ సభ్యులుగా నీయమించడం జరిగింది. కడప జిల్లా జమ్ముల మడుగుకు చెందిన ముదిమాల లక్ష్మీదేవి గత 10 సంవత్సరాలుగా బాలల సంక్షేమం ముఖ్యంగా బాలికల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం కృషిచేయడం జరిగింది.

LEAVE A RESPONSE