Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు దళితులు కీలుబొమ్మలా?

– అధికారం కట్టబెట్టిన దళితులపైనే ఎందుకీ దుర్మార్గాలని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం.
• దళిత యువకుడిని దారుణంగా చంపి, అతని శవాన్ని అతని ఇంటివద్దే పడేసిన సొంతపార్టీ ఎమ్మెల్సీని ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకోవడం ఏమిటి?
• వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేయడం దళితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన కంటితుడుపు చర్యేనా?
• ముఖ్యమంత్రి పీఠం నుంచి జగన్మోహన్ రెడ్డిని దించేయడం కోసం దళితజాతి మొత్తం ఒకేమాటపై నిలవాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, అధికారపీఠం అధిష్టించగానే, వాస్తవం మరిచి తన భస్మాసుర హస్తాన్ని అదే దళిత వర్గాలపై పెట్టి, వారిని అధ:పాతాళానికి తొక్కడం శోచనీయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ…

“దళిత వర్గాలకు చెందిన నాయకులుగా, ఆయా వర్గాలపై ముఖ్యమంత్రి అనుసరిస్తు న్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాలను తొక్కేసే మనువాదాన్ని ఎందుకు విడనాడ లేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడేనా? తన పార్టీకి చెందిన ఒక నాయకుడు తనవద్ద పనిచేసే దళిత డ్రైవర్ని వ్యక్తిగత కారణాలతో చంపేసి, అతని శవాన్ని నేరుగా అతని ఇంటివద్దే పడేసి, మృతుడి భార్యను బెదిరించిన అహంకారి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దుర్మార్గుడు.

జరిగిన దారుణంపై దళితవర్గాలు గొడవ చేయగా..చేయగా ముఖ్యమంత్రి ఎప్పటికో అతన్ని తనపార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి సస్పెండ్ అయిన వ్యక్తిని మరలా తనపార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం, ముఖ్యమంత్రే అతన్ని పక్కన కూర్చోబెట్టుకో వడం ఏమిటి? అలా చేయడానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించడంలేదా? సామర్లకోటలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి పక్క నే అనంతబాబు కూర్చోవడం ఏమిటి? ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏమిటి? ఇదంతా చూస్తే కేవలం దళితుల కంటితుడుపు కోసం జగన్ రెడ్డి అతన్ని తూతూమం త్రంగా సస్పెండ్ చేశారని అర్థమవుతోంది.

దళితులు ఏం పాపం చేశారని అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్మోహన్ రెడ్డి వారినే లక్ష్యంగా చేసుకున్నాడు? ప్రముఖ దళితవైద్యుడైన డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? ఒక మంచి డాక్టర్ ఉసురుపోసుకున్నది ఆయన కాదా? దళితవాడలో నుంచి వందలాది ఇసుకలారీలు వెళ్లడం వల్ల తమ వాడ పాడై పోతుందని, రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రశ్నించిన పాపానికి దళిత యువకుడైన వర ప్రసాద్ కు పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టిస్తారా? ఇదెక్కడి న్యాయం? దళితుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయడం ఏమిటని రాష్ట్రపతి కార్యాలయం ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వరా? ఇదేమీ పాలన అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం?

దళిత యువతిని నలుగురు యువకులు బంధించి నాలుగురోజులు మానభంగం చేసి, చివరకు ఆమెను పోలీస్ స్టేషన్ ముందే పడేసి వెళ్లిపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా? జరిగిన ఘటనకు వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో చచ్చిపోవాలి. కానీ జరిగింది ఏమిటి.. మానభంగం చేసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు? అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకా లకు, దళితులు కీలుబొమ్మలా? చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ కుమార్ ను కొట్టి చంపారు. అంత దారుణానికి పాల్పడిన సబ్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసినట్టే చేసిర మరలా ఉద్యోగం ఇవ్వడం ఏమిటి?

కల్తీ మద్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, పెంచిన ధరలపై ప్రశ్నించిన ఓంప్రతాప్ అనే దళిత యువకు డిని చంపేస్తారా? ముఖ్యమంత్రిని ఒక మాట తూలినంత మాత్రాన అతన్ని చంపేస్తారా ? ఓం ప్రతాప్ కాల్ డేటా ఇంతవరకు బయటపెట్టలేదు. పులివెందుల నియోజకవర్గం లో దళితమహిళ నాగమ్మను ముఖ్యమంత్రికి తెలిసినవారే మానభంగం చేసి, చంపేస్తే ఏం చర్యలు తీసుకోరా? అంత దుర్మార్గానికి పాల్పడిన వారికి శిక్షలు పడేలా చేయరా?

ఇలా ఉంటే దళితులు రాష్ట్రంలో ఉండాలా.. వెళ్లిపోవాలా? పశువైద్యుడైన దళితుడు డాక్టర్ అచ్చెన్నను అవమానించి.. వేధించిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? దళిత అధికారి పిలిస్తే అతని కిందిస్థాయి సిబ్బంది స్పందించరా? అందుకే అంటున్నాం.. అందర్ని సమానంగా చూడాలనే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. రాష్ట్రంలోని దళి తులు తమకు జరిగే అవమానాలు, ఎదురవుతున్న అన్యాయాలను ఎవరికి చెప్పుకో వాలి? పోలీస్ వ్యవస్థ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నేత్రత్వంలో జీహుజూర్ వ్యవస్థగా మారింది.

జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ దళిత వ్యతిరేకే. దళితుల అభ్యున్నతి చూసి జగన్మోహన్ రెడ్డికి కన్ను కుడుతుంది. దళితులు బాగుంటే, సంతోషంగా ముఖ్యమంత్రి చూసి తట్టుకోలేరు. కాదని వైసీపీలోని దళితనాయకులు చెప్పగలరా? ముఖ్యమంత్రిని నేరుగా కలిసి మాట్లాడే ధైర్యం వైసీపీలోని దళిత నేతలకు ఉందా? ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం.

ఇదంతా గమనించాక దళిత జాతి మొత్తం ఒకేమాటపై నిలవాలి. మనందరికీ జ్ఞానోదయం కలగాలి.. మనందరం ఒక సంకల్పం చేసుకోవాలి. జగన్మో హన్ రెడ్డి లాంటి వ్యక్తి మరలా అధికారంలోకి రావడానికి వీల్లేదనే ఆలోచనపై దళితజాతి నడవాలి. మన ఉన్నతిని ఆకాంక్షించే వారికోసం దళితజాతి పనిచేయాలి. మనల్ని తొక్కిపడేయాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డిని అధికారపీఠం నుంచి తొలగిం చేవరకు దళితజాతి జాగరూకతతో ఉండాలి.” అని రామయ్య సూచించారు.

LEAVE A RESPONSE