Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రాలో పోలీసులు ఉన్నారా?: రావుల

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఉన్నారా? లేదా అనే అనుమానం దేశ ప్రజల్లో మొదలయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై పట్టపగలు వైసీపీ నేతలు, గూండాల్లా దాడికి దిగారంటే ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో, పోలీసులు ఏ పార్టీకి కొమ్ముకాస్తున్నారో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన గూండాలను అరెస్ట్ చేయడంపైనే ఏపీ పోలీసుల విశ్వసనీయత, నిజాయితీ ఆధారపడి ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా రాష్ట్రపార్టీ అధ్యక్షులు బక్కని నరసింహులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్న గారు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రాగడ్డ ప్రసూన , సామా భూపాల్ రెడ్డి, బండి పుల్లయ్య , రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిలు గన్నోజు శ్రీనివాస చారి ,జీవీజీ నాయుడు,షేక్.ఆరీఫ్ , రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు ఎన్.దుర్గా ప్రసాద్ , .శ్రీనివాస్ నాయుడు , జాఠోతు ఇందిరా , భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు కుందరపు కృష్ణమా చారి , తెలుగు యువత అధ్యక్షులు పోగాకు జైరామ్ చందర్ , చేవేళ్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శీ వెంకట్ రెడ్డి , రాష్ట్ర ఎస్.సి-సెల్ ప్రధాన కార్యదర్శి గుడెపు రాఘవులు , తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కానురి జయశ్రీ , తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సుర్యదేవర లత , టి.ఎన్.టి.యు.సి ఉపాధ్యక్షులు .ఏ.బి.ఆర్ మోహన్ , , తెలుగు యువత పబ్లీసిటి సెక్రటరి విజయ్ శేఖర్ , మైనారిటి నాయకులు, యువత నాయకులు, జుబ్లీహిల్స్, ఖైరాతబాద్ డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదితరులు పాల్గోన్నారు.

LEAVE A RESPONSE