Suryaa.co.in

Andhra Pradesh

దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలు

– బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశాయని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక నగరంపాలెం లో శనివారం ప్రభుత్వ చౌక ధరల డిపోలను బిజెపి నేతలు సందర్శించారు.
ఈ సందర్భంగా. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలపై పెన భారం మోపుతుంది.ట్రూ అప్ చార్జీల పేరుతో పేదల నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు దిగజారి ప్రవరిస్తున్నాయి అన్నారు.రాజుకీయ నాయకుడుకి బాష, ప్రవర్తన ముఖ్యమని మొదటి నుంచి చెపుతున్నామని హితవు పలికారు.నిన్న టీడీపీ , వైసీపీ నేతలు దుర్బషలు ఆడుకోవడం రాష్ట్ర ప్రజలు అందరు గమనిస్తున్నారన్నారు. ఒక్కో ప్రజా ప్రతినిధి రెండు లక్షల మందికి ఆదర్శమని గుర్తించాలని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ని గెలిపిస్తే ప్రజలు మెచ్చే పాలన అందిస్తాం అని కన్నా వివరించారు. ఈసందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన రాష్ట్ర కన్వీనర్ రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రధాని మంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చిన రేషన్ పంపిణీ పై ఆరా తీశారు.


రేషన్ షాపులు వద్ద, రేషన్ వ్యాన్ ల పై మోడీ ఫోటో లేకపోవడం పట్ల బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అన్నారు. కోవిడ్ సమయంలో ఒక్కోక్కరి 5 కిలోల బియ్యం కేంద్రం ఉచితంగా ఇచ్చిందనీ గుర్తు చేశారు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిదిగా జగన్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం లో ఇచ్చే రేషన్ లో 30 శాతం కేంద్రం సబ్సిడి ఇస్తుందన్నారు. కానీ కేంద్రం చేసే సాయం ఎక్కడా చెప్పడం లేదన్నారు. వైఎస్, జగన్ ల ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.ఇది మంచి పద్దతి కాదు. ప్రతి రేషన్ షాపు వద్ద మోడి ఫోటో పెట్టాలని కిషోర్ బాబు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ,కోస్తాంధ్ర డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ శనక్కాయల అరుణ,కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా శివన్నారాయణ రమాకుమారి,నిజాముద్దీన్ నీలంప్రసాదు,లక్ష్మణ్, అనుమోలు ఏడుకొండలు,పాలిశెట్టి రఘు,వనమా నరేంద్ర,గంగాధర్,దేసు సత్యనారాయణ నమ్రత, రమాదేవి,రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE