• వివేకాకుమార్తె సునీత సుప్రీంకోర్టులో వేసిన పిల్ లోని అంశాలతో సీబీఐ ఏకీభవించడంపై ముఖ్యమంత్రి ఏంచెబుతారు?
• ఏపీప్రభుత్వం వివేకాహత్యకేసుని నీరుగార్చడానికి చేసిన ప్రయత్నాలను సీబీఐ సుప్రీంకోర్టుకి నివేదించాక కూడా జగన్ రెడ్డి స్పందించడా?
మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
వివేకానందరెడ్డిని అతికిరాతకంగా చంపించిన జగన్ రెడ్డి, హత్యను చంద్రబాబు, లోకేశ్ లకు ఆపాదించి, ఎన్నికల్లో లబ్దిపొందడానికి చేయాల్సిన నీతిమాలిన పనులన్నీ చేశాడని, విజయసాయిరెడ్డిసహా, మరికొందరు జగన్ రెడ్డికి హత్యతో సంబంధమేలేదన్నట్టుగా కట్టు కథలు చెప్పారని, హత్యకేసువిచారణలో సుప్రీంకోర్టుతాజాగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడేమి సమాధానం చెబుతారని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ప్రశ్నించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“సొంతబాబాయ్ ని గొడ్డలిపోటుతో అడ్డుతొలగించిన జగన్ రెడ్డి, ఎన్నికల్లో లబ్ది పొందడానికి దాన్ని చంద్రబాబుగారికి, లోకేశ్ లకు అంటగట్టాలని చూశాడు. తన సాక్షిమీడియాలో తాటికాయంత అక్షరాలతో తప్పుడురాతలు, నీతిమాలిన కథనాలు రాయించాడు. ఆనాడు ప్రతిపక్షంలోఉన్న జగన్ రెడ్డి బాబాయ్ హత్యని గుండెపోటుగా చిత్రీకరించి, మొసలి కన్నీరుకార్చి, ఓట్లకోసం ఆడాల్సిన డ్రామాలన్నీఆడాడు. ఆఖరికి అధికారం దక్కించుకోవా లన్న యావతో సొంతతల్లి, చెల్లిని ప్రజల్లోకి పంపి, చిలువలు, పలువులుగా దుష్ప్రచారం చేయించాడు.
వారిని తన స్వలాభానికి వాడుకొని, అవసరం తీరగానే ఇద్దరినీ గాలికి వదిలేశాడు. వారినే అలాచేసిన జగన్ రెడ్డి, బాబాయ్ హత్యకేసువిచారణను సక్రమంగా జరిపి, నిందితులను శిక్షిస్తాడా? ఆ నమ్మకంలేకనే వివేకాకుమార్తె సునీత తన తండ్రిని చంపినవారిని శిక్షించడంకోసం ఒంటరిపోరాటం చేసింది. వివేకాహత్యజరిగి ఏళ్లు గడుస్తున్నా, అసలు నిందితులను పట్టుకోలేకపోవడానికి, సీబీఐ విచారణ సక్రమంగా జరక్కపోవడానికి రాష్ట్రప్రభుత్వ వైఖరే కారణమని, కేసువిచారణను మరోరాష్ట్రానికి బదిలీచేయాలని కోరుతూ వై.ఎస్.సునీత సుప్రీంలో పిల్ దాఖలుచేసింది. సునీత వేసిన పిల్ లోని అంశాలతో, విచారణసంస్థ సీబీఐ కూడా అంగీకరించింది. వివేకాహత్యకేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, జగన్ రెడ్డి తన అధికారబలంతో కేసుని నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నాలకు దర్పణంగా నిలిచాయి.
వివేకా హత్య కేసులో సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరుంది. హత్యకు రూ.50కోట్ల సుపారీ ఇచ్చారని కూడా పేర్కొన్నారు. అప్రూవర్ దస్తగిరి వివేకాహత్యకేసులో శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డితో పాటు, చాలాబలమైన వ్యక్తులు ఉన్నారని చెప్పినట్లు కూడా సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న ఆబలమైన వ్యక్తులుఎవరు? వివేకాహత్యకేసు విచారణను అడ్డుకుంటున్న అదృశ్యశక్తి ఎవరు? విచారణ సక్రమంగా జరగకుండా మోకాలు అడ్డుతున్నది ఎవరు? ముఖ్యమంత్రి, ఆయనకున్న చిత్తశుద్ధిలోపమే వివేకాహత్యకేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీకావడానికి ప్రధాన కారణం.
సొంత బాబాయ్ హత్యకేసు విచారణ మందగమనంలోసాగేలా చేసిన ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలి. హత్యకేసులో పాల్గొన్నది ఎవరు.. వారివెనకున్న బలమైన శక్తులు ఎవరు? సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పేరుప్రఖ్యాతులున్నవారిని లాయర్లుగా పెట్టుకోగలరా? వారికి అంతస్తోమత ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. హత్యజరిగినప్పుడు ఘటనాస్థలానికి వెళ్లిన సీఐ శంకరయ్య , అక్కడ సాక్ష్యాలు తారుమారుచేయడానికి సహకరించాడు. తరువాత ఈ ప్రభుత్వం అతనికే ప్రమోషన్ ఇచ్చి, కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చింది.
ఎందుకలా చేసిందో, ఎవరిని కాపాడటానికి చేసిందో ముఖ్యమంత్రికి తెలియదా? సీబీఐ విచారణను అడ్డుకునే క్రమంలో ఆ విభాగానికి చెందిన అడిషనల్ ఎస్పీపై ఏపీపోలీసులు తప్పుడు కేసులుపెట్టడం హత్యకేసులోని ముద్దాయిలతో ప్రభుత్వకుమ్మక్కుకు నిదర్శనంకాదా? వివేకాహత్యకేసులో అసలు ముద్దాయిలను పట్టుకోవాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే, తక్షణమే ఆయన తనపదవి నుంచి వైదొలిగి, సీబీఐకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం.
మంత్రి కారుమూరి ఆగడాలు, అవినీతి భరించలేకే అతని అనుచరులు టీడీపీలోకి వచ్చారు. మంత్రి కారుమూరినాగేశ్వరరావు అరాచకాలు, అవినీతి ఎక్కువైపోయి, సొంత క్యాడర్ నే పట్టించుకోలేని విధంగా తయారయ్యాడు. మంత్రి చర్యలతో విసిగిపోయిన ఆయన అనుచరులు, అభిమానులు నేడు టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కారుమూరిని సొంతపార్టీ వారే ఛీకొడుతున్నారు. అదేమీ పట్టించుకోకుండా ఆయన దోచుకొని, దాచుకునే పనిలో నిమగ్నమయ్యాడు” అని రాధాకృష్ణ స్పష్టంచేశారు.