కేసీఆర్ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు

Spread the love

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈనెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరిగే BRS పార్టీ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ తో కలిసి పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణంలో కి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా నగరంలోని 24 నియోజకవర్గాల నుండి వచ్చే పార్టీ శ్రేణుల వాహనాల పార్కింగ్ కోసం 24 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, BRS పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply