Home » ఆశ గళం..అమృతకలశం

ఆశ గళం..అమృతకలశం

అమృతాన్ని గళంలో నింపుకున్న అక్కాచెల్లెళ్ళు..
హిందీ సినిమాని అర్దశతాబ్దానికి పైగా
ఏలేసిన కోయిలమ్మలు..
అక్క లతమ్మ గొంతులో
యక్షగంధర్వులనే అబ్బురపరిచే తియ్యందనం..
చిన్నమ్మ ఆశ స్వరంలో
గమ్మత్తైన మత్తు..
ఉర్రూతలూగించే మహత్తు..
షాక్కొట్టే విద్యుత్తు
మొత్తంగా ఆ అమ్మల ఇంటిపేరు విద్వత్తు..!

పియతూ అబ్ తో ఆజా..
కార్వాన్లో ఈ పాట
బాండ్ బాజా..
తీస్రీ మంజిల్లో రపీతో డ్యూయట్టంటే
భయపడితే భోస్లే..
లతక్క అందిట నువ్వు మొదట
మంగేష్కర్..తర్వాతే భోస్లే..
ఆమాత్రం భరోసా..
ఆ పాట ఆశా కెరీర్ కే హైలేసా..
ఆ సంగీత దర్శకుడు బర్మన్
బాలీవుడ్ ఒకనాటి రెహ్మాన్
ఆశా జీవితానికే సులేమాన్
ఆమె కలల హీమాన్!

దమ్మారే దమ్..
దమ్ముకొడుతూ జీనత్..
మారిపోయింది ఆమె కిస్మత్..
ఏం కిట్టిందో గాని
ఆశాకు కీమత్..
పండింది దేవానంద్ పంట..
ఆ పాట ఆల్ టైం హిట్టంట!

ఆధునిక సినిమా రంగీలా..
పాడేసింది ఆశా కిలాకిలా..
తరం ఏదైనా అలరిస్తునే ఉంటుంది నిరంతరం…
ఈ మోనీకా ఓ మై డార్లింగ్
అహ్ అహ్ అ ఆ..
ఆ పాట వింటుంటే ఇప్పటికీ
మన్ కీ రాజా ఠండీ హోగా..
ఇప్పుడు ఎవరు విన్నా
ఆ మధుర గాయనికి
ప్యాన్ బనేగా!
అలాంటి పాటలు పాడుతూ
ఆశాజీ సౌ సాల్ జీయేగా!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply