పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది

78

– తొడలు కొట్టడం మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: జగన్ రెడ్డి అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి నేత, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. తొడలు కొట్టడం మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా? లేక ఫ్యాషన్ అనుకుంటున్నారా? కార్యకర్తల కన్నీళ్ళకు కారణమైన ఖాకీలను,వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాలను దిక్కరిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. వ్యవస్థలన్నింటిని తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల్ని వేధిస్తున్నారు. 3 ఏళ్లలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంతమందిని జైళ్ళకు పంపారో లెక్కలేదు.వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు నాయకులకు టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా 60 లక్షల మంది టీడీపీ సైన్యం మీ వెన్నెoటే ఉంటుంది.

జగన్ రెడ్డి అరాచకాలకు కొంతమంది పోలీసులు, అధికారులు వంత పాడటం దుర్మార్గం. పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కై అక్రమ కేసులు అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రిలతో టీడీపీ కార్యకర్తల్ని వేదిస్తున్నారు.మరికొందరు పోలీసులు మా కార్యకర్తలపై తొడలు గొడుతూ మీసాలు తిప్పుతున్నారు. ఇది డ్యూటీ లో భాగం అనుకుంటున్నారా? లేక ఫ్యాషన్ అనుకుంటున్నారా?

పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది.చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నాం.అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మా కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.

2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ ఉండదు, జగన్ రెడ్డి ఉండరు.. తప్పులు చేసిన వైసీపీ నేతల్ని వాళ్ళ తప్పుడు పనులకు సహకరించిన పోలీసుల పరిస్థితి ఏంటో ఆలోచించు కోండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే మీ పై చర్యలకు శ్రీకారం చుడతాం.