పోరాటానికి మరో రూపమే పొట్టి శ్రీరాములు

– కింజరాపు అచ్చెన్నాయుడు

ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి సంధర్బంగా ఆ మహనీయునికి నివాళి అర్పిస్తున్నాం. పోరాటానికి మరో రూపమే పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల దిక్కార పతాకగా మారి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అన్నారంటే అది పొట్టి శ్రీరాములు పోరాట పటిమకు నిదర్శం. పొట్టి శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి, నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా తన జీవితాన్ని త్యాగం చేశారు. స్వాంతత్ర్య సమరంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షను సైతం అనుభవించారు. జీవితం చివరిదశలోనూ హరిజనోద్ధరణకు కృషిచేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేద్దాం. మరొక్కసారి ఆ మహనీయునికి నివాళి అర్పిస్తూ…

Leave a Reply