– వైఎస్సార్సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
ఢిల్లీః టిడిపి ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిది. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారు.జనాకర్షక సిఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి , రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టిడిపి ప్రయత్నం. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో టిడిపిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్య పద్దతిలో అధికారం అందుకోవడంలో విఫలమయ్యారు. దాంతో అప్రజాస్వామికంగా, అక్రమంగా ఆర్టికల్ 356 ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సిఎంపై బోసిడికె అని టిడిపి నేత బూతులు మాట్లాడారు. అనేక మంది టిడిపి నేతలు ఏ మాత్రం సంకోచించకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సిఎం జగన్‌పై టిడిపి నేతల దుర్భాషతో ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. రాజ్యాంగపదవుల్లో ఉన్న సిఎంపై చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడి దుర్బాషలాడేవారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. టిడిపి డర్టీ పాలిటిక్స్‌పై ప్రజల ఆగ్రహం ఫలితమే టిడిపి ఆఫీసులపై దాడులు. దాడుల ఫొటోలు చూపి చంద్రబాబు సానుభూతి పొందాలని చూస్తున్నాడు. దాడులు ఎందుకు జరిగాయన్నదానిపై బాబు సైలెంట్ గా ఉన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలను కనీసం చంద్రబాబు ఖండించలేదు? ముఖ్యమంత్రి జగన్‌పై టిడిపి నేతలు దుర్బాషలాడుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే సభ్యత, సంస్కారం లేకుండా బూతులు మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు.