– ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
బాలినేని వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఛీ పొమ్మని పదవి పీకేసి జగన్ రెడ్డి పొమ్మన్నారు. జిల్లాలో ఇక ఎవరూ తనకి నమస్కారం పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో పరువు కొనుక్కునే పనిలో పడ్డాడు బాలినేని. పదవి పోయిన సందర్భంగా జిల్లాలో అడుగు పెడుతున్నా కార్లు పెట్టమని అడుకోవడం , నేను లేస్తే మనిషిని కాదంటూ ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చే ఎలివేషన్లు అన్ని ఉనికి కాపాడుకోవడానికే. శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కారణంగా జిల్లాలో ఉన్నాడే తప్ప లేకపోతే శ్రీలంకలో ప్రత్యర్థులను పేకాడేసేవాడే!