– 60మందిపై కేసులు.. 38మంది ప్రభుత్వం, 22మంది ప్రైవేటు సంస్థల సిబ్బంది, మాజీ విద్యార్థులుపై చర్యలు
– మంత్రి బొత్స సత్యనారాయణ
కొన్ని ప్రాంతాలలో జరిగిన చిన్న సంఘటనలు ను రాజకీయంగా వివాదం చేశారు. పదో తరగతి పరీక్షలు పేపర్ లీక్ కాలేదు, మాస్ కాపీయింగ్ జరగలేదు. 60మంది పై కేసు నమోదు చేయగా, 38మంది ప్రభుత్వం, 22మంది ప్రైవేటు సంస్థల సిబ్బంది, మాజీ విద్యార్థులుపై చర్యలు తీసుకున్నాం.రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రిమినల్ కేసు పెట్టాం. సెల్ పోన్, వాట్సప్ ద్వారా ఆన్సర్ చేసేందుకు ప్రయత్నం చేశారు.ఉయ్యూరులో ఐదుగురు టీచర్ లను పేపర్ రెడీ చేస్తుండగా పట్టుకున్నాం.
రాజకీయ పార్టీలు ప్రభుత్వం పై బురద జల్లాలని చూస్తున్నారు. మేము తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు సైలెంట్ గా ఉంటాయా? వాళ్లు కూడా విషయం తెలుసుకుని బాధ పడుతున్నారు.టెక్నాలజీ ని మంచి కోసం వాడాలే కాని.. ఇలా విద్యార్థుల జీవితం తో ఆడుకోవద్దు. బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని అంటుంటే నవ్వొస్తుంది. ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది ప్రమేయం పై ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎవరిని ఉద్దరించడానికి లోకేష్, అచ్చెంనాయుడుల లేఖలు రాశారో?లోకేష్ రాజకీయం కోసమే మాట్లాడుతున్నాడు. 60లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు వారికి పట్టదా?
ఆధారాలతో పట్టుకున్నాక… కక్ష సాధింపు అనడం ఏమిటి? స్కూల్స్ ప్రమేయం ఉంటే వాటి అనుమతి రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెడతాం. ఈనెల 6 నుండి 24 ఇంటర్ పరీక్షలు కు పది లక్షల మంది హాజరు అవుతున్నారు. వాటికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.అన్ని అంశాలు పరిశీలించి, అవసరమైతే సిసి కెమెరా ల ఏర్పాటు ను పరిశీలిస్తున్నాం. పరీక్షల ను రాజకీయం చేయవద్దు… మరో వేదిక పై చూసుకుందాం.