– తుఫాన్ సమయంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొబైల్ కొన్న జగన్
– మొంథా తుఫానుతో బెంగళూరు ప్యాలెస్లో జగన్ విలాసం
మొంథా తుఫాను రానున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజలు భయాందోళనలో,తీవ్ర పరిస్థితులతో, వణికిపోతు ఉంటే, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులోని తన 22 ఎకరాల రాజభవనంలో విలాసవంతంగా సమయం గడుపుతున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతున్న వేళ, జగన్ చల్లటి ఏసీ గదిలో కూర్చుని, ఇటీవల లండన్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొబైల్లో ‘పబ్ జీ’ (PUBG), ‘ఫ్రీ ఫైర్’ వంటి గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారని, అలాగే ప్రతిరోజూలానే వెచ్చటి మటన్ పాయ ఆస్వాదిస్తున్నారని సమాచారం.
కొత్త మొబైల్ వేగం, పనితీరును పరీక్షించడానికి ఆయన ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, గేమ్లకు సమయాన్ని వృథా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు
జగన్ వైఖరికి పూర్తి విరుద్ధంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రాణ నష్టం జరగకుండా, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
* కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ: ప్రాణనష్టం జరగకుండా ఉండటానికి, సహాయసహకారాలు అందించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్ మరియు అనిత, ఇతర కీలక శాఖల (హోంశాఖ, విపత్తు నివారణ, విద్యుత్, రెవెన్యూ శాఖ) అధికారులతో కలిసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆర్టిజీఎస్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
* క్షేత్రస్థాయికి మంత్రులు: మంత్రులైన నిమ్మల, సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, నారాయణ, మనోహర్, గొట్టిపాటి సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి చేరుకుని ప్రజలకు అండగా నిలిచారు.
* బాధితులకు భరోసా: వీరంతా స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ, తుఫాను బాధితుల కోసం పునరావాస కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలను అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు.
ఒకవైపు ప్రకృతి విపత్తు సమయంలో ప్రాణ నష్టం జరగకుండా 75 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు రాత్రింబవళ్లు ప్రజలకు అండగా నిలబడుతుంటే, మరోవైపు ప్రతిపక్ష నాయకులు విలాసాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజల్లోనే కాకుండా వైసీపీ వర్గాలలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది.
– బి.బి కృష్ణ