111 చెంచు నూతన జంటలకి సామూహిక వివాహాలు
– హాజరైన గవర్నర్ విష్ణుదేవ వర్మ , మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జడ్జి శ్రీదేవి మాధవి
ఆదిలాబాద్ : ఆర్ఎస్ఎస్ అనుబంధ వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో 111 చెంచు సామాజిక వర్గానికి చెందిన నూతన జంటలకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సామూహిక హాలు జరిపించడం జరిపించారు. పెళ్లి సామాగ్రి పుస్తె లు , మెట్టెలు ఇతర సామాగ్రి వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ శాఖ అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ విష్ణుదేవ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జడ్జి శ్రీదేవి మాధవి తో పాటు.. వనవాసి కళ్యాణ పరిషత్ అఖిల భారతాధికారి రామచంద్రయ్య హాజరయ్యారు.