– జూబ్లీహిల్స్ లో రెండు పార్టీలను బొందపెడితేనే చలనం
– జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: పేరుకే జూబ్లీహిల్స్. పారే మురికి కాలువలు, కంపు వాసన, గతుకుల రోడ్లు ఏ పేదవాడిని కదిలించినా మమ్ముల్ని పట్టించుకునే వాడు లేడని బాధ పడుతున్నారు. భర్త చనిపోయి ఐదేళ్ళు అయినా పెన్షన్ రావడం లేదని కొంతమంది, 65 ఏళ్ళు దాటిన రావడం లేదని మరికొంతమంది చెప్తున్నారు.
ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఇస్తాం అంటూ మోసం చేసింది ఇవన్నీ ఇస్తారని కాంగ్రెస్ కి ఓటు వేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే మోసం చేస్తోంది. పెన్షన్ లేవు, ఇళ్లు లేవు. మురికి కాల్వలు సరిగా లేవు. తాగే నీళ్లు కూడా సగ్గగా రావడం లేదని వీరంతా చెప్తున్నారు.
జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్ లో రిచెస్ట్ ప్లేస్. కానీ ఈ బస్తీలలో బాధలు మాత్రం వర్ణనాతీతం. టిఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టినం, కాంగ్రెస్ కి కూడా అదే గతి అంటున్నారు. 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మంత్రుల మధ్య సమన్వయం లేదు. మంత్రులకు డబ్బులు సంపాదించుకోవడానికి దోచుకోవడానికే సమయం సరిపోతుంది తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు.
ప్రజల సమస్యల మీద అసెంబ్లీ వేదికగా కొట్లాడుతున్న పార్టీ బీజేపీ. జూబ్లీహిల్స్ లో రెండు పార్టీలను బొందపెడితేనే చలనం వస్తుంది. పెన్షన్లు రావాలన్నా, డబుల్ బెడ్ రూం ఇళ్లు రావాలన్నా, మురికి కాలువలు కట్టాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే వారి మెడలు వంచి బీజేపీ కొట్లాడుతుంది కాబట్టి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
దీపక్ రెడ్డి ఇప్పటికే ఇక్కడ పోటీ చేసి ఉన్నారు. అందరికీ సుపరిచితుడు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మా పార్టీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, లీడర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ గారే ఉండాలని కోరుకుంటున్నారు.
మోదీ లేకపోతే దేశం అధోగతి పాలవుతుందనే భావన ప్రజల్లో ఉంది. బీజేపీ అంటే ఎంత ప్రేమ ఉందో, విశ్వాసం ఉందో దీనిని బట్టి అర్థం అవుతుంది. కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు షోపుటప్ గాళ్ళు. తిమ్మిని బమ్మి చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వారి మీద ప్రజలకు నమ్మకం లేదు. జూబ్లీహిల్స్ లో బిజెపి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న