– స్వయంగా సహాయ పనుల పర్యవేక్షణ
– అధికారులను పరుగులు పెట్టించిన యువ ఎంపి
– అధికారులతో కలసి లోతట్టు ప్రాంతాల పర్యటన
– హాస్టళ్లు, స్కూళ్లలో పరిస్థితి పర్యవేక్షించిన ఎంపి సాన సతీష్
కాకినాడ: మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ .. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి కాకినాడ పట్టణం ఏటిమొగ, దుమ్ములుపేట; పర్లోవపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, తాళ్ళరేవు మండలం గాడిమొగ ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
కాకినాడ పట్టణంలో పునరావాసక కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం కాకినాడ సూర్యకళామందిరం ప్రక్కన సిద్ధం చేసిన భోజన పదార్థాలను రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే రుచి చూసి పరిశీలించారు.
అనంతరం కాకినాడ పట్టణం దుమ్ములుపేట తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పర్లోవపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలకు ఎంపీ సానా సతీష్ బాబు స్వయంగా మధ్యాహ్నం భోజనం వడ్డించారు. అనంతరం కాకినాడ జిల్లా తాళ్ళరేవు గాడిమొగ ధీరుబాయ్ అంబానీ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు భోజన పదార్థాలు వడ్డించారు.
మొంథా తుఫాను నేపథ్యంలో కాకినాడ జిల్లాలో 18 మండలాల్లో 67 గ్రామాలు, 5 పట్టణ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని ఎంపీ సానా సతీష్ బాబు సూచించారు