-జగన్ ఇంటి వెనుక బారికేడ్లు తొలగింపు
-ప్రజలకు తగ్గనున్న 1.5 కిలోమీటర్ల దూరం
తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వెనుక ఉన్న కరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల రాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. రెండు వైపులా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వారిని మాత్రమే వెళ్ళనిచ్చేవారు. చంద్రబాబు సర్కార్ తాజా ఆదేశాలతో ప్రజలకు 1.5 కిలో మీటర్ల ప్రయాణ భారం తగ్గుతుంది.