Suryaa.co.in

Andhra Pradesh

బాబును అరెస్టు చేసి, విచారించాలి

-వైఎస్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌

తప్పించుకు తిరుగుతున్న దొంగ చంద్రబాబు
అమరావతి రాజధాని పేరిట రెండు కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి చంద్రబాబు, లోకేష్ లకు అక్రమంగా రూ.118 కోట్లు ముట్టాయని కేంద్ర ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. అయితే, ఈ నోటీసులకు సరైన సమాధానం చెప్పకుండా, డొంక తిరుగుడు వాదనలు చేస్తూ, చంద్రబాబు దొంగలా తప్పించుకు తిరుగుతున్నాడు.

మరోవైపు మా నాన్న నిప్పు అని గొప్పలు చెబుతున్న ఆయన కొడుకు లోకేశ్‌ కూడా ఐటీశాఖ నోటీసులపై నోరుమెదపడం లేదు. దీన్నంతటినీ జాతీయ మీడియా సైతం ప్రచారంలోకి తీసుకొచ్చిం ది. చంద్రబాబుకు ఐటీశాఖ జారీచేసిన నోటీసులపై జరుగుతున్న పరిణామాల్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.

చంద్రబాబుకు తన భవిష్యత్‌ కళ్లకు కనిపిస్తుందేమో..? తనను రేపోమాపో అరెస్టు చేస్తారని నిన్న మాట్లాడాడు. ఆ విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరమేముంది..? తప్పు చేసినోడ్ని చట్టం శిక్షించకమానదు. ఈ విషయం చంద్రబాబుకు సైతం తెలుసు కనుకే ఆయనలో ప్రస్తుతం భయం బయల్దేరింది. మరి, ఇప్పటికైనా ఆయన ఆర్జించిన అవినీతి సంపాదనపై తప్పు ఒప్పుకుంటాడా..? లేదంటే, తప్పు నుంచి తప్పించుకుంటాడా..?.

బాబు అవినీతి సముద్రంలో రూ.118 కోట్లు నీటిబొట్టే
అమరావతి రాజధాని పేరిట షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ కంపెనీలు చిన్న కాంట్రాక్టు పనుల్లోనే చంద్రబాబుకు రూ.118 కోట్లు ముడుపులు చెల్లించారు. అలాంటిది, ఈ రెండు కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు వేలకోట్ల కాంట్రాక్టులు దక్కించుకుని.. రాష్ట్రప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు డ్రా చే శాయి. అంటే, ఎన్ని రూ.వేల కోట్లు చంద్రబాబు అండ్‌ కో ముఠాకు అంది ఉంటాయో అర్ధం చేసుకోవాలి. దీన్నిబట్టి లెక్కవేస్తే.. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఆర్జించిన రూ.వేల కోట్లల్లో ఐటీ పట్టుకున్న రూ.118 కోట్లు కేవలం సముద్రంలో నీటిబొట్టు మాత్రమేనని తెలుస్తుంది. అదేవిధంగా స్కిల్‌డెవలప్‌మెంట్‌లో రూ.350 కోట్ల కుంభకోణం, టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో స్కామ్‌ తదితర అన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతోన్న క్రమంలో బాబు బొక్కలన్నీ బయటపడే రోజులొస్తున్నాయి.

బాబుకు సెల్ఫ్‌ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అదిః
రాజధాని ప్రాంతంగా అమరావతిని చెప్పుకుని.. దాన్ని అడ్డంపెట్టుకుని ప్రజాసంపదను దోచుకోవడమే తప్ప ఇక్కడి ప్రజలపై చంద్రబాబుకు ప్రేమాలేదు.. దోమాలేదు. అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అని ఆయన చెప్పిన మాటకు అర్ధమేంటా..? అని చూస్తే.. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు సంపాదించుకోవడమేనని అర్ధాన్ని వివరించాడన్నమాట. ప్రేమ, త్యాగం అంటూ తోటకూర కబుర్లు చెప్పి రైతుల రక్తం తాగిన వ్యక్తిని ఏమనాలి..?
చంద్రబాబులాంటి దొంగను ప్రపంచంలో ఎక్కడైనా చూడగలమా..? 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం మొత్తం ఎన్నికలొస్తున్నాయంటే, కొత్త హామీల్ని ఊదరగొట్టడమే గానీ.. ఏరోజైనా రాష్ట్ర ప్రజలకు గతంలో నేను మేలు చేశానని.. మరలా అదే మేలును చేస్తానని చెప్పుకుంటాడా..? అంటే, చేసిన మేలే లేనప్పుడు చంద్రబాబు మాత్రం ఎలా చెప్పుకోగలడు..? అంటూ సమాధానం వినిపిస్తుంది. బాబు హామీలు ఎలా ఉంటాయంటే, ఎవడైనా హైదరాబాద్‌కు అన్నీ ఉన్నాయండీ… సముద్రం ఒక్కటే లేదంటే.. మనం హామీఇచ్చి తీసుకొద్దాం అనే రకం చంద్రబాబు.
బాబును అరెస్టు చేసి విచారించాలిః
చంద్రబాబు ఐటీశాఖకు అడ్డంగా దొరికిన దొంగ. రాష్ట్ర సంపదకు భద్రత లేకుండా పోయిందంటే అది చంద్రబాబులాంటి ద్రోహులు, దుర్మార్గుల పాలన వల్లనే అనేది ఐటీ నోటీసులతో తేటతెల్లమైంది. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు ఉంటేనే రాష్ట్రఖజానాకు తూట్లు పొడిచి రూ.లక్షల కోట్లు సంపాదించాడంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. పాలకుల్ని నమ్మితే ఇలాగే నట్టేట ముంచుతారా..? అని చంద్రబాబును నిలదీసే రోజులొచ్చాయి. అవినీతి ముడుపుల్లో లోకేష్ కూడా సూత్రధారి అని ఐటీ నోటీసుల్లో పేర్కొంది. నిజంగా ఆయన నిప్పో తుప్పో తేలాలంటే చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి విచారించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం.

LEAVE A RESPONSE