నీతిఆయోగ్ సీఈఓకు బాబు నోట్

Spread the love

– మోదీ సూచనతో పరమేశ్వరన్-బాబు భేటీ
– డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌పై చర్చ

ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్‌తో భేటీ అయ్యారు. జి-20 దేశాలకు భారత్ నాయకత్వం వహించిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. భారత్ నిర్వహించాల్సి పాత్రపై, ఆయన వారి సలహాలు అడిగారు. అందులో భాగంగా, ఈ భేటీకి హాజరయిన చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని కలిశారు.

ఆ సందర్భంలో సమావేశంలో బాబు ప్రస్తావించిన అంశాలను, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్‌తో చర్చించాలని బాబుకు సూచించారు. దానితో ఆయన, తాను ప్రతిపాదించిన డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌పై పరమేశ్వరన్‌తో చర్చించారు. దానికి సంబంధించి ఒక నోట్‌ను సీఈఓకు అందించారు. ఆ సందర్భంగా డిజిటల్ నాలెడ్డ్ విజన్ వల్ల దేశానికి వచ్చే లాభాలు, దానితో ప్రపంచ టెక్నాలజీ అనుసంధానం తదితర అంశాలను ఆయన సీఈఓతో చర్చించారు.

Leave a Reply