– కమిషన్ రిపోర్టు లో లోపాలు సరి చేయాలని సీఎం కు సూచించాం
– మీడియాతో మందకృష్ణ మాదిగ
హైదరాబాద్: అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ ను కలిసాం. వర్గీకరణ పై షమీమ్ అక్తర్ రిపోర్ట్ సరిగా చూడకుండా క్యాబినెట్ ఆమోదించి పూర్తి చర్చ జరగకుండా ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసింది. కమిషన్ రిపోర్టు లో లోపాలు సరి చేయాలని సీఎం కు సూచించాం.
మేం చెప్పిన అభ్యంతరాలను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకొని షమీమ్ అక్తర్ కమిషన్ గడువు పెంచారు.అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి , సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఉన్న లోపాలను కమిషన్ కు చదివి వినిపించాం. హేతుబద్ధత, న్యాయ సమ్మతంగా జరపాలని సుప్రీంకోర్టు సూచించింది .
అవి ప్రస్తుత కమిషన్ నివేదికలో మిస్ అయ్యాయని తెలియజేయడం జరిగింది. అత్యంత వెనుకబడిన కులాలైనా బుడగజంగం, డక్కలి, మాంగ్ వంటి కులాలను అభివృద్ధి చెందిన పంబాల, మన్నె కులాలతో కలిపి వారికి ఒక శాతం రిజర్వేషన్ కేటాయించారు. దీనివల్ల వెనుకబడిన కులాలు మళ్ళీ దోపిడీకి గురవుతాయి. అత్యంత వెనుకబడిన కులాల వారికి 171625 జనాభాను ప్రామాణికంగా తీసుకుని 1% రిజర్వేషన్ కేటాయించారు.