Suryaa.co.in

Padayatra News

కళ్ళు తెరవకపోతే శాశ్వత నిద్రలోకే….

ప్రభుత్వానికి బాలకోటయ్య హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అనే మూర్ఖపు ఆలోచనకు తెరదించి, కళ్ళు తెరవకపోతే రెండున్నరేళ్లలో శాశ్వితంగా నిద్ర తప్పదని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. ప్రాంతీయ భావోద్వేగాలతో మరోమారు అధికారంలోకి రావాను కోవటం పగటి కల అని తేల్చేశారు. రాజధాని రైతులు ఎందుకు భూములిచ్చారో, రాజధాని లేని కారణంగా రాష్ట్రం ఎలా దివాళా తీసిందో, అమరావతి రైతులది ఎంతటి న్యాయమైనదో ప్రజలు పూర్తి అవగాహన తో ఉన్నట్లు చెప్పారు.
శుక్రవారంనాడు ఆయన న్యాయస్థానం టు దేవస్థానం రైతుల పాదయాత్రలో మాట్లాడుతూ రోజురోజుకు మహా పాదయాత్రకు గ్రామాల నుంచి, పల్లెల నుంచి, పట్టణాలకు నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నట్లు చెప్పారు . శుక్రవారం నాడు తిక్కిరెడ్డి పాలెం గ్రామం నుండి ప్రారంభమై పత్తిపాడు,అప్పినేని గుంట పాలెం, వరగాని, పెదనందిపాడు గ్రామాల మీదుగా దాదాపు 13కి.మీ పాదయాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు పూలు జల్లి స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE