Suryaa.co.in

Andhra Pradesh

నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ ఆస్తుల విలువ 81.63 కోట్లు

సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్‌ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో చూపించారు. దీని ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా, ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలుగా ఉంది. ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది. అటు అప్పులకు సంబంధించి బాలకృష్ణకు రూ.9 కోట్ల 9 లక్షల 22 వేలు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య వసుంధరకు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలు గా చూపించారు.

LEAVE A RESPONSE