Suryaa.co.in

Andhra Pradesh

రాయిదాడి కేసులో టీడీపీ అభ్యర్థిపై కుట్ర

-అధికార పార్టీ నీడలోనే పోలీసులు
-విజయవాడ పోలీసు కమిషనర్‌ పన్నాగం
-కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ వచ్చినా ఇంకా అధికార పార్టీ నీడలోనే పోలీసులు పనిచేస్తున్నారని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ శనివారం లేఖ రాశారు. పోలీసులను అస్త్రంగా చేసుకుని ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్రమంగా అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెట్టి వైకాపా అభ్యర్థులకు మేలు జరగాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని లేఖలో వివరించారు.

అసలు హత్యాయత్నమే జరగని కేసు లో సెక్షన్‌ 307 నమోదు చేసి బెయిల్‌ కూడా రాని విధంగా విజయవాడ పోలీసు కమిషనర్‌ ముంద స్తు పన్నాగం పన్ని సతీష్‌ వద్ద నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకుని బోండా ఉమను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఆయనపై గెలవలేనని తెలిసి పోలీసులతో వెల్లంపల్లి ఆడుతున్న డ్రామాగా కనిపిస్తోందని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. సీఎంపై రాయి దాడి ఘటనపై ఎన్నికల పరిశీలకుల నుం చి స్వతంత్ర నివేదికలు తీసుకోవాలని, ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక ఈసీ బృందం రాష్ట్రానికి రావాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఈసీ బృందాలు పరిశీలించాలి: వర్ల రామయ్య ఫిర్యాదు
ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందని ఎన్నిక ల కమిషన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్ధితో కుమ్మక్కై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమను అక్రమంగా అరెస్టు చేసేందుకు విజయవాడ పోలీసు కమిష నర్‌ కుట్ర పన్నారని పేర్కొన్నారు. అందుకే ఈ కేసులో బెయిల్‌ కూడా రాకుండా ఉండటానికి సెక్షన్‌ 307 పెట్టారు. టీడీపీ నేత దుర్గారావుతో పాటు మరో 20 మంది మహిళలను అదుపులోకి తీసుకుని ఇప్పటివరకు వారిని ప్రజల ముందు ప్రవేశపెట్టలేదు. నామినేషన్‌ వేసిన అభ్యర్ధులను అక్రమంగా అరెస్టు చేసి వారిని చిత్రహింసలకు గురి చేసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసు లను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోకి ప్రత్యేక ఈసీ బృందాలు వచ్చి పోలీ సుల పనితీరును పరిశీలించాలని, అప్పుడే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయని కోరారు.

LEAVE A RESPONSE