-విష్ణుకి బాలయ్య ఫోన్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘ మా ‘ ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది . అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికలకు తాజాగా నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది . ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ల ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది .
ఇక ఓ వైపు థియేటర్స్ సమస్యలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు .. మరోవైపు మా ఎన్నికలతో మొత్తంగా టాలీవుడ్ అంతా హడావుడిగా కనిపిస్తుంది.ఇక మా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఊపందుకున్నాయి . ఇక ఈసారి యువకుడు అయిన మంచు విష్ణు .. మా అధ్యక్ష పదవికి కోసం బరిలోకి దిగుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది . ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .
చివరి నిమిషం వరకు మా ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకున్నాడు విష్ణు.చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు . కానీ నేను అలా చేయలేదు . ఎందుకంటే ఎవరైనా ఇండ్రస్టీ పెద్దలు కలిసి మంచి వ్యక్తిని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారేమో అని ఎదురుచూసాను.కానీ అలా జరగడం లేదని గ్రహించాకే తాను కూడా పోటీలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించానని మంచు విష్ణు తెలిపాడు .
ఇక బాలకృష్ణ లాంటి వ్యక్తి ఎన్నికల నుండి తప్పుకోమని అడిగితే తప్పుకుంటా అని .. కానీ బాలకృష్ణ అంకుల్ నాకు ఫోన్ చేశారు.మంచి నిర్ణయం తీసుకున్నావ్ తమ్ముడు .. నీకు నేనున్నా .. ధైర్యంగా ముందుకు వెళ్ళు అని అన్నారు .
ఇక మెగా బ్రదర్ నాగబాబు గురించి కూడా మంచు విష్ణు మాట్లాడుతూ .. నేను నాగబాబు అంకుల్ ని మా ఇంటి పెద్దగా భావిస్తాను. వాళ్ళందరి కళ్ళ ముందు నేను పెరిగాను. కానీ ఆయన చేసిన కామెంట్స్ నన్ను బాధించాయి..అని చెప్పుకొచ్చాడు .
ఇక కొంతమంది ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే హడావుడి చేసారు.వాళ్ళల్లో ప్రస్తుతం మా అసోసియేషన్ పదవుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు . అలాంటి వాళ్ళని ఒక రూమ్ లో వేసి ఇండ్రస్టీ పెద్దలు అంతా కలిసి చేతులు వాచిపోయేలా కొట్టాలి.
మా అసోసియేషన్ లో ఉంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్ చేశారు మంచు విష్ణు.ఇక అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి .