Suryaa.co.in

Andhra Pradesh

అనధికార కార్మికులు గా గుర్తించబడిన సెక్స్ వర్కర్స్ కు కోవిడ్ పునరావాస పధకాలు అమలు చేయాలి

విజయవాడ : కోవిడ్‌ మహమ్మారి వల్ల జీవనోపాదులు, ఉపాది అవకాశాలు కోల్పోయిన సెక్స్‌ వర్కర్లు ను అనధికార కార్మికులుగా గుర్తిస్తూ, ఇతర కార్మికులకు వర్తించే వివిధ సంక్షేమ పథకాలుతో పాటు కోవిడ్‌ పునరావాస కార్యక్రమంలో సెక్స్‌ వర్కర్లకు కుడా భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ‘‘జాతీయ మానవ హక్కుల కమీషన్‌’’ ఈ ఏడాది మే నెలలో జారీ చేసిన ఉత్తర్వులును వెంటనే అమలు పరిచేలా చర్యలు చేపడ్తూ, వాటి అమలు తీరు తెన్నులును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ‘‘రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌’’ ను కోరుతూ తీర్మానం చేసినట్లు “విముక్తి” రాష్ట్ర అద్యక్షురాలు మెహరున్నీసా తెలిపారు.
మంగళవారం స్థానిక ప్రస్‌ క్లబ్‌లో సెక్స్‌ వర్కర్లు మరియు అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘‘విముక్తి’’ ఆధ్వర్యంలో అనధికార కార్మికులు – సెక్స్ వర్కర్స్ వారి హక్కులు అనే అంశం పై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాష్ట్రం వివిధ ప్రాంతాల నుంచి షుమారు 50 మంది సెక్స్ వర్కర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో విముక్తి రాష్ట అధ్యక్షులు మెహరున్నీసా మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల సంఘం కు మేము మనస్పూర్తిగా ధన్యవాదాలు తెల్పుతున్నాము. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత మొట్టమొదటి సారిగా ఒక జాతీయ స్థాయి ప్రభుత్వ సంస్థ (జాతీయ మానవ హక్కుల సంఘం) ‘‘సెక్స్‌ వర్కర్లు’’ ను అనధికార కార్మికులుగా గుర్తిస్తూ 2020 అక్టోబర్‌ 5 అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా సెక్స్‌ వర్కర్స్ వివిధ రకాల కార్మికులు పొందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలు పొందటానికి లేదా అడగటానికి వీలు కల్గింది. విముక్తి వ్యభిచారాన్ని చట్టబద్దత చేయమని ఎప్పుడూ అడగదు, పైగా వ్యతిరేకం కూడా, అయితే సెక్స్‌ వర్కర్లును కాకుండా వేశ్యా గృహ యజమానులు, ట్రాఫికర్స్‌, మేనేజర్లు, దళారులు, మధ్య వర్తులును మాత్రమే నేరస్థులుగా గుర్తించాలని ‘‘విముక్తి’’ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుందని ఆమె తెలిపింది.
మేము ముందుగా అక్రమ రవాణాకు గురైన తర్వాత ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారం, నష్ట పరిహారం అంధక పోవడం, మరోపక్క కుటుంబ అప్పులు తీర్చుకోలేక పోవడం, అలాగే సమాజంలో మాపై చూపుతున్న చిన్న చూపు వల్లనే విధిలేని తప్పని పరిస్థితుల్లో వ్యభిచారంలోనే కొనసాగవల్సిన దుస్థితి ఏర్పడింది అని విముక్తి కార్యదర్శి శ్రీమతి పుష్పవతి ఆవేదనగా అన్నారు. లైంగిక వృత్తి గౌరవ ప్రదమైనది కాదు. అది హింసతో కూడినట్లుది. అయితే ఎక్కువ మంది సెక్స్‌ వర్కర్లు తమ కుటుంబాలను, పిల్లలును పోషించుకోవడం కోసం మాత్రమే ఈ వృత్తిని వదులుకోలేక పోతున్నారు అన్నారు.
జాతీయ మానవ హక్కుల కమీషన్‌ 2020 అక్టోబర్‌ 5 న విడుదల చేసిన ఆదేశాలు ప్రకారం మన రాష్ట్రంలో లక్షా 50 వేలమంది పైగా సెక్స్ వర్కర్స్ ఉంటే అందులో షుమారు 200 మంది సెక్స్‌ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం నుంచి రెండు నెలలు రేషన్‌ మాత్రమే పొందగలిగారు. కానీ అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ‘‘నగదు’’ సహాయం సెక్స్ వర్కర్స్ కు ఈ రోజుకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెక్స్‌ వర్కర్లు తమ బంధువులు, కుటుంబాలు గుర్తించకుండా తప్పించుకోవడం కోసం, అలాగే మెరుగైన సంపాదన అవకాశాలు కోసం సెక్స్‌ వర్కర్లు చాలా తరచుగా వేరే చోటకు వలసలు వెళ్తారు. కోవిడ్‌ మహమ్మారి వల్ల వీరు ఇతర పట్టణాలు, జిల్లాలు, టౌన్లలో ఉండిపోయేలా చేసింది. వారు ఉన్న పట్టణం లేదా జిల్లాకు సంబంధించిన రేషన్‌ కార్డ్స్‌ వారికి లేనందున వారికి రేషన్లు మరియు ఏదైనా ఇతర సహాయాలు తిరస్కరించబడ్డాయి. వారు పొదుపు చేసుకున్న సొమ్ము అయిపోయిన తరువాత ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల నుంచే అధిక వడ్డీకి అప్పులు చేయవలసి వచ్చింది.
ఇటువంటి పరిస్థితిలో అక్టోబర్‌ 2020 న జాతీయ మానవ హక్కుల కమీషన్‌ విడుదల చేసిన సూచనలు మేరకు జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ, రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థలు ద్వారా సెక్స్‌ వర్కర్లకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ, ప్రభుత్వం ఇతరులకు అందిస్తున్న అన్ని సహాయ సహకారాలు, సేవలు అందేలా చూడాలి అని ఆదేశించినా రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థలు వీరిని ఆడుకోవడం లో పూర్తి స్థాయిలో విఫలమైందని విముక్తి కార్యవర్గ సబ్యులు ఆరోపించారు.
రాష్ట్రంలో క్రొత్తగా రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ కార్యాలయం ఏర్పాటు చేసినందున తక్షణమే కమీషన్ తమ డిమాండ్‌లను పరిశీలించాలని కోరుతూ ఒక వినతి పత్రం పంప్తున్నట్లు తెలిపారు.
1. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ సమన్వయం తో ‘‘జాతీయ మానవ హక్కుల కమీషన్‌’’ 2021 మే నెలలో విడుదల చేసిన ఆదేశాలు అమలు తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించి, జాతీయ మరియు ‘రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌’’ కు ప్రతి నెల నివేదికలు అందేలా చూడాలి
2. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన నెలవారీగా జరిగే ప్రణాళిక, సమీక్ష సమావేశాల్లో ‘‘జాతీయ మానవ హక్కుల కమీషన్‌’’ జారీ చేసిన ఆదేశాలు ఏమేరకు ‘‘సెక్స్‌ వర్కర్ల’’కు అందుబాటులోకి వస్తుందో సమీక్షించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసేలా చూడాలి.
3. జాతీయ మానవ హక్కుల కమీషన్‌ ఆదేశాలు ప్రకారం అనధికార కార్మికులుగా గుర్తించబడిన ‘‘సెక్స్‌ వర్కర్లు’’కు మెప్మా, సెర్ప్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వీరితో పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ ఉపాధి పధకాలు, కార్యక్రమాలు వీరికి అందించాలి.
4. 100% సెక్స్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించి వారి పిల్లలు ఈ ఊబిలోకి రాకుండా కాపాడాలి.
ఈ సమావేశంలో విముక్తి రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులు రజని, సంయుక్త కార్యదర్శి అపూర్వ, కార్యవర్గ సభ్యులు భానుప్రియ, జ్యోతి, శ్రావణి, నాగ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE