Suryaa.co.in

Telangana

నీ గాండ్రింపులకు బెదిరే పార్టీ కాదు..

అందుకే డప్పుల మోత మోగిస్తున్నం. నీ వీపు మోత మోగిస్తాం
– కేసీఆర్…..కేంద్రం లేఖ ఇచ్చినా ధాన్యం ఎందుకు కొనడం లేదు?
* రైతులను ఇంకా ఎందుకు మోసం చేస్తున్నవ్?
* ధాన్యం కొనకుండా నరుకుతా…ముక్కలు చేస్తానంటూ ఇంకా ఎందుకు టైం పాస్ చేస్తున్నవ్?
* దళిత బంధు అమలు చేయకపోతే సీఎం వీపు మోత మోగిస్తం
* ఆ దేశాలకు సాయం చేసిన భారత్ ను కించపర్చడానికి సిగ్గులేదా?
బీజేపీ ఎస్సీ మోర్చా ‘డప్పుల మోత’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
‘‘కేసీఆర్….రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందుకు సిద్దమని కేంద్రం లేఖ ఇచ్చి నెలలు దాటుతున్నా రైతుల నుండి ఇంకా ఎందుకు ధాన్యం సేకరించడం లేదు? నరుకుతా…ముక్కలు చేస్తానంటూ టైం పాస్ చేస్తూ రైతులను ఎందుకు మోసం చేస్తున్నవ్. అసలు రైతుల నుండి ధాన్యం కొంటవా? కొనవా? ఏడేళ్లుగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందెవరో చెప్పే దమ్ముందా? కేంద్రం కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతావా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు.
బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ బాబూ జగ్జీవన్ రాం చౌరస్తా నుండి లిబర్టీ అంబేద్కర్ చౌరస్తా వరకు డప్పుల దరువు మోగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డితోపాటు పలువురు దళిత నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. దీంతోపాటు తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….
సీఎం రైతులను ఆదుకుంటవా? లేదా? ఇంకా అబద్దాలు చెబితే వినే స్థితిలో లేరు. రోజూ టైం పాస్ చేసుకుంటూ మందు తాగుతూ కోళ్లు, మేకలు నరికితినడం అనుకున్నవా?
టైం చెప్పు…డేట్, ప్లేస్ డిసైడ్ చెయ్. నా తెలంగాణ ప్రజల కోసం నరుక్కోవడానికి సిద్ధం. నా దళిత, బడుగు బలహీనవర్గాలతోపాటు సబ్బండ వర్ణాల బాగు పడతానంటే నా తల నరుక్కోవడానికి నేను సిద్ధం. మేం త్యాగాలకు వెనుకాడం. దేశం, ధర్మం, సమాజం కోసం…సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ‘భారత్ మాతా కీ జై’ జై భీం…జై తెలంగాణ అంటూ నీ గడీలు బద్దలు కొట్టేందుకు…నిన్ను టచ్ చేసేందుకు మేం సిద్ధం…బీజేపీ కాదు. అందుకే డప్పుల మోత మోగిస్తున్నం. నీ వీపు మోత మోగిస్తాం.
దళిత బంధు పథకాన్ని ఈనెల 4 నుండి అమలు చేస్తానని కేసీఆర్ మాట తప్పిండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేయాల్సిందే. అప్పటి వరకు ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడే యుద్దాన్ని ప్రారంభించినం. డప్పుల మోత ఇవాళ స్టార్ట్ చేసినం. కేసీఆర్ చెవుల నుండి రక్తం కారాల్సిందే ఇప్పుడు డప్పు మోత మోగించినం. రేపటి నుండి కేసీఆర్ వీపు మోత మోగిస్తం.
దళిత సీఎం చేస్తానని ఎవరైనా అడిగిండ్రు? నువ్వే చేస్తానన్నవ్ కదా… మరి ఎందుకు మాట తప్పినవ్. కొన్ని కారణాలవల్ల చేయలేకపోయినన్నవ్. ఆ కారణాలేందో చెప్పు. అదేమైనా అంతర్జాతీయ రహస్యమా? మాట ఇచ్చినవ్ కాబట్టే నువ్వు సీఎం అయినవని గుర్తుంచుకో… నువ్వెన్ని మాటలు చెప్పినా దళితుణ్ని సీఎం చేసే వరకు నిన్ను వదిలిపెట్టం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిందే. నువ్వు సీఎం సీటు నుండి దిగిపోవాల్సిందే.
దళిత బంధుపై ఇంకా ఎందుకు కుంటి సాకులెందుకు చెబుతున్నవ్? నియోజకవర్గానికి వంద మందికి కాదు…. హుజూరాబాద్ లో అకౌంట్లో వేసిన 17 వేల దళితులకు వెంటనే క్యాష్ ఇవ్వాల్సిందే. తెలంగాణాలోని దళితులందరికీ రూ.10 లక్షల చొప్పున ఇవ్వాల్సిందే. అప్పటి నుండి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
కేసీఆర్ అంకుల్ డిప్రెషన్ లో ఉన్నడు. నిన్న నేను చెప్పినవన్నీ రాసుకున్నడు. బీపీ ఎక్కువైనట్లుంది. గోళీలు కూడా సరిగా వేసుకోనట్లుంది. నేను అడిగిన వాటికి జవాబు ఇవ్వకుండా కాయిల్ తప్పి ఏదేదో మాట్లాడుతుండు.
రాష్ర ప్రభుత్వం వ్యాట్ పెంచలేదన్నవ్. 5 శాతం పెంచినట్లు ఆధారాలు చూపిన. మరి ఎందుకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తవా? లేదా? నేనడిగిన పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో నువ్వెందుకు ఓటు వేయలేదు? అని….ఆ విషయం చెప్పకుండా నా గురించి మాట్లాడుతుండు….. ఆనాడు నేను ఎంపీని కాదు. మరి నువ్వు ఎంపీవే కదా…ఎందుకు హాజరు కాలేదు. అంత పీకుడు పనేముంది? ఆనాడు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న విజయశాంతి స్పీకర్ పై దాడి జరగకుండా అడ్డుకుని బిల్ పాస్ చేయించింది కదా…
భారత్ కంటే ఆఫ్ఝనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లను కేసీఆర్ పొగడటం సిగ్గుచేటు. ఆ దేశాల్లోని జనం తిండి లేక అల్లాడుతున్నరు. ఆప్ఝనిస్తాన్ లో తినడానికి 5 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు మనమే ఇచ్చినం. శ్రీలంక జీడీపీ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఆ దేశంలో రేట్లు ఎట్లున్నయో సోయి లేదా? అక్కడ జనం ఎంత ఇబ్బంది పడుతున్నరో తెల్వదా? వాళ్ల బాధలు చూడలేక భారత్ రూ.500 కోట్లు ఇచ్చిన సోయి మర్చినవా?
ధాన్యం గురించి కేంద్రాన్ని బద్నాం చేస్తున్న కేసీఆర్ ను నేనొక్కడే అడుగుతున్న. ఈ ఏడేళ్లలో ధాన్యం కొన్నదెవరు? కేంద్రమే కొన్నదని నిరూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తవా?. ఈ వానా కాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినా ఇంకా ఎందుకు కొనడం లేదు? రైతులు పండించిన ధాన్యమంతా రోడ్లపై పొసిండ్రు. కొనేవాళ్లు లేక రైతులు అల్లాడుతున్నరు. ఎప్పుడు వానొస్తదే తెల్వక భయపడుతున్నరు. అయినా నీకు కనికరం లేదా?

LEAVE A RESPONSE