ప్రగతి భవన్‌లో చావు డప్పు తప్పదు:ఈటల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దళితబంధు ఇవ్వకుంటే ప్రగతి భవన్‌లో చావు డప్పు తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన బీజేపీ డప్పు మోత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నిక స్ఫూర్తితో దళితుల కోసం జరిగే ప్రతి పోరాటంలో పాల్గొంటానని ఈటల హామీ ఇచ్చారు. తనకంటే తెలివైన వారు లేరని కేసీఆర్ అనుకుంటున్నారని, తన మొహం అసెంబ్లీలో చూడకూడదని కేసీఆర్ అనుకుని భంగ పడ్డాడని ఈటల అన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని కేసీఆర్ చవి చూపించారని ఈటల అన్నారు.