కొందరు పోలీసు అధికారులు సీఎంకు కొమ్ముకాస్తున్నరు

Spread the love

– బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు భయం పట్టుకుంది
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్

చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.అనంతరం మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి చొప్పదండిలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.

రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ అభివ్రుద్ధికి ఎంపీ నిధులు కేటాయిస్తా. ప్రజల అభివ్రుద్ది, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నం. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే కుట్రలు చేస్తున్నరు. అందులో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం డైరెక్షన్ లో… పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నయ్. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నరు.

గతంలో నల్గొండ, కరీంనగర్ లో నాపైనా…. ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ పై దాడి చేయడం, కార్యకర్తలపై హత్యాయత్నం చేయడం సీఎం కుట్రలో భాగమే. నిన్న ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసేందుకు కుట్ర చేశారు. స్థానిక సీఐ నానా బూతులు తిడుతూ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నరు.

రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు సీఎంకు కొమ్ముకాస్తున్నరు. ఇది మంచి పద్దతి కాదని వారిని హెచ్చరిస్తున్నా. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు భయం పట్టుకుంది. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని భయానక వాతావరణం స్రుష్టించాలనుకుంటున్నడు.అరాచకాలు చేయాలి. అక్రమాలు చేయాలి. కోట్లు సంపాదించాలి. ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసి గెలవాలన్నదే కేసీఆర్ పంథా. కేసీఆర్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నరు. తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్.

ఇకపై రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మూసి వేస్తున్నట్లు సీఎం ప్రకటించడం దారుణం. కొనుగోలు కేంద్రాలు మూసివేస్తే పండించిన ధాన్యాన్ని రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? పంటలే వేయొద్దంటున్న కేసీఆర్… లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టించినట్లు?
కేంద్ర ప్రభుత్వం యాసంగిలోనూ రా రైస్ ఎంతైనా కొనేందుకు సిద్దంగా ఉంది. అట్లాంటప్పడు రైతుల నుండి ధాన్యం ఎందుకు కొనడం లేదో సీఎం జవాబు చెప్పాలి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకరిస్తూ ఒప్పంద పత్రాలపై సంతకం చేసింది నిజం కాదా?

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిందే… రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. రైతుల బాధలు పట్టించుకో ఇకనైనా కేసీఆర్ పట్టించుకోవాలి… దాడుల పేరుతో సమస్యలను దారి మళ్లించే జిమ్మిక్కులు మానుకోవాలి. ఖరీఫ్ మాదిరిగా యాసంగిలో రైతులను ఇబ్బంది పెడితే బీజేపీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు కేంద్రంపై నెపాన్ని మోపాలని చూస్తే ఈసారి రైతులే తిరగబడతారనే సంగతిని గుర్తుంచుకోవాలి.

Leave a Reply