– రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలి.
– హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
సిద్దిపేట జిల్లా: కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లి లో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు కొట్టుకుపోయిన కల్వర్టులను పరిశీలించారు.బస్వాపూర్ అక్కెనపల్లి మధ్య వెళ్ళే బ్రిడ్జి వద్ద మోయ తుమ్మెద వాగు పరిశీలించారు.రోడ్ల పై ఆరబోసిన వడ్లు వరద కు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు.
వరదలతో ముంపులోనే ఉన్న దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు.ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లను ,కల్వర్టులను , దెబ్బతిన్న పంటలను అధికారులు మొత్తం రికార్డు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ఏమన్నారంటే.. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. పూర్తిగా జలమయం అయింది. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్ పరిధిలో పూర్తిగా నష్టం జరిగింది. రైతాంగం పూర్తిగా నష్టపోయింది.
వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతింది. కొట్టుకుపోయింది. రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయి. ఇప్పుడే ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హుస్నాబాద్ లో పర్యటించాలని ముఖ్యమంత్రి ని విజ్ఞప్తి చేశాం. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తుంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇక్కడ పర్యటించాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ప్రభుత్వం బాధ్యత గా రైతులను ఆదుకుంటాం. నియోజకవర్గంలో ముగ్గురికి ప్రాణ నష్టం జరిగింది. చరిత్రలో ఇక్కడ ఇంత వర్షం ఎక్కడ పడలేదని చెబుతున్నారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు ప్రజల మధ్యే ఉండి నష్టపోయిన పంటలను అంచనా వేయాలని, భారీ వరదలకు జరిగిన నష్టాన్ని మొత్తం రికార్డు చేయాలని అధికారులను ఆదేశించాం.