బిసి ల ఆశాజ్యోతి మహానేత జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలో గల జ్యోతిరావు ఫూలే విగ్రహానికి భారతీయ జనతాపార్టీ VZM BJP జిల్లా అధ్యక్షులు రెడ్డి పావనీ గారు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా VZM BJP జిల్లా అధ్యక్షులు రెడ్డి పావనీ గారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం, అభివృద్ధికి, మహిళల విద్యావిధానంలో ఉన్నత మార్పులకు నూతన ప్రణాళికలు రూపొందించి మహిళా విధ్యా, అభ్యుదయానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు మన జ్యోతిరావు ఫూలే అని కొనియాడుతూ… ఆయన ఆశయాలు సాధనకై మన భారత ప్రధాని నరేందర్ మోడీ జీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ నిరంతరం కృషి చేస్తూందనీ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగెల అచ్యుత హరనాధ్ , VZM BJP OBC ఉపాధ్యక్షులు ఇప్పిలి కొండ యాదవ్ , మహిళా మోర్చా అధ్యక్షులు గండికోట శాంతి , పద్మ , సోషల్ మీడియా కన్వీనర్ మజ్జి రామారావు, నార్త్ జోన్ అధ్యక్షులు ఇమంది సుధీర్, ఈస్ట్ జోన్ అధ్యక్షులు కొండల శ్రీనివాస్, ఆర్టిసన్ సెల్ కన్వీనర్ కుప్పిలి మోహన్ ఆచారి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.