– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
– ముంపు గ్రామాల పరిధిలోని పాడి రైతులకు పశుగ్రాసాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నందివాడ14:నందివాడ మండల పరిధిలోని వరద ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. వరద ప్రభావంతో ఏర్పడిన గడ్డి కొరత కారణంగా, మండలంలోని పాడి రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న 5.5 మెట్రిక్ టన్నుల పశుగ్రాస పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిన లింగాల గ్రామంలో శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెద్ద లింగాల, చిన్న లింగాల, చేదుర్తిపాడు, ఓద్ధుల మెరక, అరిపిరాల, ఇలపర్రు గ్రామాల పరిధిలోని పాడి రైతులకు 220 పశుగ్రాస బస్తాలను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు,మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు చాట్రగడ్డ రవి, తాతినేని మురళి, కలపాల భద్రరావు, గగ్గా రామారావు, నాగరాజు, కుంటం రాజు, దాసం రాంబాబు, యలమంచిలి సతీష్, కాకరాల సురేష్, అట్లూరి వెంకటరమణ , పశుసంవర్ధక శాఖ అధికారులు, పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.