Suryaa.co.in

Telangana

ఆరు గ్యారెంటీలు ఎత్తేసిన భట్టి.. వట్టి బడ్జెట్ ఇది

– యువవికాసం పెరు మీద కాంగ్రెస్ నాయకులకు దోచిపెట్టే కాంగ్రెస్ వికాస బడ్జెట్
– తెలంగాణ ప్రజలను వంచించే బడ్జెట్ ఇది
– మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: “కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచించే విధంగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా బట్టి అబద్ధాల చిట్టా చదివారు అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలు,420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయలేమని చేతులెత్తేసినట్టే ఉంది అన్నారు. గంటన్నర పాటు బడ్జెట్ చదివిన ఆర్ధిక మంత్రి భట్టి వట్టి మాటలే చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలతో ప్రతి వర్గాన్ని మభ్యపెడుతూ చేస్తున్న మోసం బడ్జెట్ స్పీచ్ లో స్పష్టం అయింది.

మొత్తం గా రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్ లా బడ్జెట్ ప్రసంగం సాగింది. మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2500 రూ. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం,చేయూత ద్వారా వృద్దులకు,వితంతులకు, బీ డి కార్మికులకు 2వేల నుండి 4 వేలు పెంపుపై విద్యార్థినులకు ఉచిత స్కూటీలు,నిరుద్యోగ భృతి 4 వేలు,ఈ బడ్జెట్ లో ఊసే లేదు.కాంగ్రెస్ అంటేనే రైతులను దగా చేసే ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. సగం కూడా పూర్తి కాని రైతు రుణమాఫీ.. మాఫీ పూర్తయిందని బడ్జెట్ లో చదివి అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొట్టింది ఈ బడ్జెట్.వ్యవసాయ రైతు కూలీలు ఈ రాష్ట్రంలో సుమారు కోటి మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 12000 కోట్లు కేటాయించాలి.

కానీ 600 కోట్లతో సరిపుచ్చి రైతు కూలీలను మోసం చేశారు. ఈ బడ్జెట్ లో కౌలు రైతుకు భరోసా ప్రస్తావన లేదు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసేలేదు.ఇది పూర్తిగా లోప భూయిష్టమైన బడ్జెట్..ఇది కాంగ్రెస్ మార్క్ మోసపూరిత బడ్జెట్. ఏ రంగం చూస్కున్నా సరైన కేటాయింపులు లేవు..ఆదాయం ఎలా సమకూర్చుకుంటారు..రెవెన్యూ లోటు ఎంత స్పష్టంగా చెప్పలేక పోయారు. ఊహాలోకంలో విహరిస్తూ..కేవలం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే బడ్జెట్ గానే ఉంది.

ఈ బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా లేదు. ఆర్ అండ్ బి శాఖ కు కేటాయించిన నిధులు ఎంతమాత్రం సరిపోవు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయింపు విస్మరించి యువ వికాసం పేరుతో కాంగ్రేస్ నాయకుల వికాసానికి మాత్రం 6000 వేల కోట్లు అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం.

“6 గ్యారంటీలు అమలు,రైతు సంక్షేమం. గ్రామీణాభివృద్ధి,విద్యా,వైద్యం,వ్యవసాయం,సాగు,తాగు నీటి రంగం ఎస్సి, ఎస్టీ, బీసీ,మైనార్టీలను విస్మరించిన బడ్జెట్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా”

LEAVE A RESPONSE