Suryaa.co.in

Andhra Pradesh

ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి సునీత విలియమ్స్

– ప్రశంసించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

విజయవాడ: ప్రపంచమే గర్వించే విధంగా అంకితభావంతో ఆసయ సాధనకు 286 రోజులు అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న సునీతా విలియమ్స్ కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందనలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వ్యోమగామి యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకమని,
అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. శాస్త్రీయ పరిశోధన పట్ల సునీత గారికి ఉన్న ఆసక్తి పట్టుదల కష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్యసహసాలు ప్రశంసనీయమన్నారు.

ఇద్దరు వ్యోమగాములు భూమిని సురక్షితంగా చేరుకోవడం ఆనందాయకమాన్నారు.

మహిళసంకల్పశక్తి,అంకితభావన్నీ చూసి ప్రపంచమే గర్విస్తుందినీ మంత్రి కొనియాడారు.

తొమ్మిది నెలల తర్వాత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్న భారత్ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE