Home » భూరక్ష కాదు భూభక్ష. భూసర్వేకాదు.. భూస్వాహా

భూరక్ష కాదు భూభక్ష. భూసర్వేకాదు.. భూస్వాహా

• ప్రజల, ప్రభుత్వ భూముల్ని చెరబట్టి, తెగనమ్మి సొమ్ముచేసుకోవడానికే భూములు, సర్వేలంటూ జగన్ రెడ్డి కొత్తదోపిడీకి తెరలేపాడు. అందుకే మీభూమి-నాభూమి అంటున్నాడు
• పరాయివారి ఆస్తులు, భూములు ఆక్రమించినవారిని కబ్జాదారులంటారని, పరాయిస్త్రీలపై కన్నేసిన వారిని రావణాసురులంటారని ఏఆత్మచెబితే తెలిసింది జగన్ రెడ్డి నీకు?
• మాజీసైనికులభూములు ఆక్రమించిన ధర్మాన, విశాఖకేంద్రంగా విజయసాయి, అతనికూతురు, అల్లుడుసాగించిన భూకబ్జాలు నీకు కనిపించలేదా జగన్ రెడ్డి?
• నరసన్నపేటలో జగన్ రెడ్డి తొలి పట్టాదార్ పుస్తకాన్ని సైనికులభూములు ఆక్రమించిన ధర్మానకు, విశాఖకేంద్రంగాభూకబ్జాల్లో మునిగితేలుతున్న విజయసాయిరెడ్డికి, అతనిఅల్లుడు,కూతురికి ఇస్తే బాగుండేది
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రభుత్వభూముల్ని ఆక్రమించిన జగన్ రెడ్డికన్ను, ఇప్పు డు ప్రజలభూములపై పడిందని, అందుకే మీభూమి-నాభూమి అంటూ, కొత్తగా భూరక్షపేరుతో భూభక్ష పథకానికి శ్రీకారంచుట్టాడని, జగనాసురుడిపాలనలో మాకు, ఇదేంఖర్మరా అంటున్న ప్రజలంతా ఇకపై వారిభూముల్ని కంటికిరెప్పలా కాపాడుకోక తప్పనిపరిస్థితి వచ్చిందని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

జగన్ రెడ్డి ప్రారంభించింది భూరక్ష పథకాన్నికాదు…భూభక్ష పథకాన్ని…
“శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగన్ రెడ్డి ప్రారంభించింది జగనన్నభూరక్ష పథకాన్ని కాదు భూభక్షణ పథకాన్ని.రాష్ట్రవ్యాప్తంగా ఎవరెవరి భూముల్ని ఎలా భక్షించాలన్నదే ఆ పథకం ముఖ్యోద్దేశం. ఆక్రమంలోనే జగన్ రెడ్డి మీభూమి-నాభూమి అంటున్నాడు. ప్రజలభూములు తనభూములుగా ప్రజలకు తెలియచెప్పడానికే జగన్ రెడ్డి భూభక్ష పథకాన్ని ప్రారంభించాడు. పరాయివాడి భూమిని ఆక్రమిస్తే అదికబ్జా అవుతుందన్న విషయం జగన్ రెడ్డికి ఇప్పుడే తెలిసిందా? నరసన్నపేటలో జగన్ రెడ్డితో వేదికపంచుకున్న మంత్రిధర్మాన భూబాగోతం సంగతేంటి? మాజీసైనికులకు చెందిన భూమి రెవెన్యూరికార్డులు మార్చేసి, దాన్ని కబ్జాచేసిన భూబకాసురుడు ధర్మాన. ఉత్తరాంధ్రలో ధర్మానతోపాటు జగన్ జైల్ మేట్ విజయసాయిరెడ్డి చేసిన కబ్జాల సంగతేంటి? విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భూకబ్జాల గురించి చెప్పు జగన్ రెడ్డి. సభలో జగన్ రెడ్డిపక్కన అటూఇటూకూర్చున్న భూకబ్జాకోరుల సంగతేంటి? రాత్రికి రాత్రి ఏఆత్మ వచ్చిచెబితే జగన్ రెడ్డికి పరాయిఆస్తులు, కబ్జాలగురించి తెలిసిందో!

జగన్ రెడ్డి నువ్వుతొలిపట్టాదార్ పాస్ పుస్తకాన్ని, సైనికుల భూముల కబ్జాచేసిన ధర్మానప్రసాదరావుకి ఇస్తే బాగుండేది. ధర్మన్నా.. నువ్వు మంచిఘనకార్యం చేశావు.. అందుకే నీకే మొదటి పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తున్నాను. నువ్వు ఆక్రమించిన భూమిజోలికి ఇకపై ఎవడూరాడని చెప్పిఇవ్వాల్సింది. అలానే ఏ2విజయసాయి, అతనికూతురు, అల్లుడు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నీపార్టీలోని ఇతర కబ్జా బ్యాచ్ కు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది జగన్ రెడ్డి. అలాచేస్తే ప్రజలకు కూడా నీసర్వేలు ఏంటో… నీభూరక్షణ పథకం ఏంటో బాగా అర్థమయ్యేది.

ఏఏ ఊళ్లలోఎవరిపేర్లతో ఎక్కడ ప్రభుత్వభూములు, విలువైన భూములున్నాయని తెలుసుకోవడానికే జగన్ రెడ్డి భూభక్ష పథకాన్ని తీసుకొచ్చాడు? జగన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చేదేంటి? రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి, పారదర్శకంగా పనులుజరిగేలాచేసి, జగన్ రెడ్డికి పట్టాదార్ పుస్తకం అంటేఏమిటో తెలియనప్పుడే, చంద్రబాబు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చాడు.
అంతులేని అవినీతి, అరాచకాలతో నువ్వుసాగిస్తున్న పాలనతో విసిగివేసారిన జనం నీ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాలను తమఇళ్లలో పెట్టుకుంటారని ఎలా అనుకుంటున్నావు జగన్ రెడ్డి? రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన భూముల్నిగుర్తించి, వాటినికబ్జాచేయడం, బ్యాంకుల్లో తనఖాపెట్టడం, అయినకాడికి అప్పులుచేయడానికే జగన్ రెడ్డి భూభక్ష పథకాన్ని తీసుకొచ్చాడని కచ్చితంగా చెప్పగలం.

ఇకపై ప్రజలు వారిభూములసమాచారాన్ని ఎప్పటికప్పుడు తనిఖీచేసుకోవాలి…
రాష్ట్రప్రజలంతా జగన్ రెడ్డి కుట్ర, కుతంత్రాలను గమనించి, ఇకనుంచి రోజూ మీభూముల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మీ భూమి.. ఇక నుంచి నా భూమి అంటున్నాడు.. దానర్థం ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భూముల్ని కాజేసిన దొంగలముఠాకు నాయకత్వం వహిస్తున్న జగన్ రెడ్డి, సర్వేలు, భూరక్షణల పేరుతో భూములకబ్జాకు తెరలేపాడు. గతంలో ఉన్న చట్టాలనుమార్చి, కొత్తగా జీవోలు తీసుకొచ్చిమరీ జగన్ రెడ్డి భూకబ్జాలను కూడా చట్టపరంగా చేయాలని చూస్తున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్ భూహక్కుచట్టం-1973కి సవరణలు చేశాడు. జీవోనెం-573ద్వారా అవకతవకలకు తెరలేపాడు. తెలుగురాష్ట్రాల్లోని చాలామంది ఇతరదేశాల్లో ఉంటున్నారు.. వారిపేరుతో ఉన్నభూముల్ని సర్వేలపేరుతో తూతూమంత్రంగా ఏదోఒకటిచేసి, వాటిని ఆక్రమించుకోవాలన్నదే జగన్ రెడ్డి భూకబ్జాముఠా లక్ష్యం. రాష్ట్రంలో భూములున్నవారు ఎవరైనా ఎక్కడున్నాసరే, అప్రమత్తంగా ఉండి, జగన్ రెడ్డి భూకబ్జాముఠా బారినుంచి మీ భూములను కాపాడుకోవాలని సూచిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే, మీభూమి-నాభూమి అన్న జగన్ రెడ్డి మాటే నిజమవుతుంది.

నీ కేబినెట్ లోని రావణాసురులు నీకు కనిపించడంలేదా జగన్ రెడ్డీ…?
పరాయిస్త్రీలమీద కన్నేసినవారిని రావణాసురులంటారనే నగ్నసత్యం ఏప్రేతాత్మ చెబితే జగన్ రెడ్డికి తెలిసిందో? కేబినెట్ లోని కాంబాబు, ఆంబోతు రాంబాబు రాసలీలల సంగతేంటి? ఆయన సాగించిన సుకన్యా..సంజనాల పర్వమేంటి? విశాఖపట్నంలో మొన్నటివరకు మంత్రిపదవి వెలగబెట్టిన, గంటా, అరగంట బంతి అవంతి సంగతేంటి? నిన్నటికి నిన్న కూడా ఆ అరగంట వ్యక్తి రోతపురాణం ప్రజలు విన్నారుకదా..జగన రెడ్డి. అసభ్యకరంగా, సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్ నీకు కనిపించలేదా జగన్ రెడ్డి? వేదికలమీద నీతివాక్యాలు, ఉపదేశాలు ఇవ్వడంకాదు జగన్ రెడ్డి.. నీకేబినెట్ లో , నీపార్టీలో ఉన్న కబ్జాకోరులు, కామాంధులు, బూతుబాబులను కట్టడిచేయ్ జగన్ రెడ్డి.

చంద్రబాబు ప్రజలగురించి, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తే, జగన్ రెడ్డి ప్రజలను రోడ్లపాలుచేసి, ఎలా రాష్ట్రాన్నిసర్వనాశనం చేయాలని ఆలోచిస్తాడు. చంద్రబాబు పర్యటనల్లో రోడ్లకు ఇరువైపులా జనంబారులుతీరి కనిపిస్తుంటే, జగన్ రెడ్డిపర్యటనల్లో రోడ్లకుఇరుపక్కలా బారులుతీరిన బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. బారులుతీరిన జనంస్థానంలో బారికేడ్ల మధ్య బారికేడ్లరెడ్డి బహుచక్కగా నటిస్తుంటాడు. తనకు ఏమాత్రం సరిపోని, సరితూగని విధంగా నీతికబుర్లు చెప్పి భంగపడుతుంటాడు. రాష్ట్రాభివృద్ధి, ప్రజలభవిష్యత్, వారిబాగోగులు, క్షేమం గురించి పనిచేసేవ్యక్తిని నారా చంద్రబాబునాయుడు అంటే, రాష్ట్రం సర్వనాశనంకావాలి.. ప్రజలకు తిండి,బట్ట దొరక్కూడదని ఆలోచించే వాడిని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఏవ్యక్తైతే తెలుగుబిడ్డలకు మంచి భవిష్యత్ ఉండాలని ఆలోచన చేస్తారో అతన్ని చంద్రబాబునాయుడు అంటారు. ఉన్నసంపదంతా మింగేసి, భవిష్యత్ తరాలకు చిన్నగోచిగుడ్డకూడా మిగలకూడదనే వాడిని జగన్ రెడ్డి అంటారు. అలాఆలోచిస్తాడు కాబట్టే జాకీపరిశ్రమను రాష్ట్రం నుంచితరిమేసి, ప్రజలకు అండర్ వేర్లుకూడా లేకుండాచేశాడు. నువ్వేంటో..నీబుద్ధేంటో, నీఆలోచనావిధానమేంటో తెలిశాక కూడా ఏమీతెలియని వాడిలా నటిస్తేఎలా జగన్ రెడ్డి? నువ్వుచెప్పే నీతివాక్యాలకు చేసేపనుల కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని ప్రజలకు అర్థమైంది జగన్. రాష్ట్రంలో ఉన్న ప్రతిఅక్కా, చెల్లి ఆర్థికంగా వారికాళ్లపై వారు నిలబడాలని ఒకఅన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఆలోచన చేసిన వ్యక్తిని చంద్రబాబునాయుడు అంటే, సొంతతల్లి, చెల్లిని అవసరానికి వాడుకొని రోడ్డుపై పడేసిన వ్యక్తిని జగన్ రెడ్డి అంటారు.

16నెలలు జైల్లో చిప్పకూడు తిన్న జగన్ రెడ్డికి, తెలుగువారి ఆరాధ్యదైవంతో పోలికా?
జగన్ రెడ్డి..నీకు మహానుభావుడు ఎన్టీఆర్ కు పోలికా? ఏం అర్హతఉందని నిన్నునువ్వు తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ తో పోల్చుకుంటున్నావు? నిజంగా నీకు ఎన్టీఆర్ పై అభిమానముంటే అన్నా క్యాంటీన్లు మూసేస్తావా.. ఆరోగ్యవిశ్వవిద్యాలయం పేరు మారుస్తావా? అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎన్టీఆర్ స్మృతివనం నిర్మాణాన్ని నిలిపేస్తావా? చేయాల్సిన దుర్మార్గాలు అన్నీచేస్తూ, సిగ్గులేకుండా ఎన్టీఆర్, ఎంజీఆర్ లతో పోల్చుకుంటావా జగన్ రెడ్డి? ఎన్టీఆర్, ఎంజీఆర్ లు నీకులాగా జైల్లోచిప్పకూడు తినలేదు జగన్ రెడ్డి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడి, వేలకోట్లప్రజలసొమ్ము దిగమింగారా? రేపోమాపో ఏ జైలుకుపోతావో తెలియని జగన్ రెడ్డీ..నీకు అన్నఎన్టీఆర్ కు పోలికా? స్వర్గీయ నందమూరి తారకరామారావుగారికి నిజమైన వారసుడు నారా చంద్రబాబు నాయుడు. అన్నగారి బాటలోనే అవినీతిమరకలు లేకుండా అభివృద్ధి,సంక్షేమం కలబోతతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నది, ఎప్పటికీ అందించేది చంద్రబాబు, తెలుగుదేశంపార్టీ” అని పట్టాభిరామ్ స్పష్టంచేశారు.

Leave a Reply