Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి బిగ్‌షాక్‌

-ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా
-త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటన

గురజాల నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ బీసీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం గురజా ల నియోజక వర్గం గామాలపాడులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీకి విధేయుడుగా పని చేశానని, 2019లో కాసు మహేష్‌ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశానని తెలిపారు.

కానీ, ఈరోజు గురజాల నియోజకవర్గంలో మహేష్‌రెడ్డి పార్టీ నాది అన్నట్టు ప్రవర్తిస్తున్న తీరుతో నన్ను నమ్ముకున్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు న్యాయం చేయలేకపోయానని వివరించారు. ఇదే విషయంపై పార్టీ పెద్దలకు విన్నవించుకున్నా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పార్టీని వీడుతున్నానని, ఇది ఎంతో బాధాకరంగా కూడా ఉందన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

LEAVE A RESPONSE