బిగ్ బాస్ షో – రాబోవు తరాల సహజీవనం

ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో “వ్యభిచార ముఠా గుట్టు రట్టు” అని వార్త వస్తుంది. కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి, పెళ్లి కాని అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని, రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు. రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే, ఇట్లాంటి పనికి మాలిన “షో” ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం.

బిగ్ బాస్.. బిగ్ బాస్
ఎవడీ బిగ్ బాస్ ?
ఎక్కడ నుండి వచ్చాడు ఈ బిగ్ బాస్ ?
ఎందుకు వచ్చాడు ఈ బిగ్ బాస్ ?
ఎవరి కోసం వచ్చాడు ఈ బిగ్ బాస్ ?
మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ బిగ్ బాస్ ?
వీడి విష సంస్కృతి ఏమిటి ?

ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు . విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు . ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని, సర్వనాశనం చేయడానికి వచ్చాడు ఈ బిగ్ బాస్ . భారతదేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు . మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ బిగ్ బాస్ ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .

మరి మీరు ఏ నాడైన ఆలోచించారా? మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి . ఈ బిగ్ బాస్ లో పెళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే హౌస్ లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు .

మరి.. పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ? ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ? ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ? ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు .
ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం .

మరి భవిష్యత్తులో.. మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , అనుమతిస్తారా ? యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ? మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా, భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి ఒప్పుకుంటారా? ఎలా చూస్తారండి ఈ దరిద్రపు బిగ్ బాస్ ని? కాస్త ఆలోచించండి .

అందరూ చదువుకున్న వారే . కానీ కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు . మీరు చేస్తున్న తప్పును తెలుసుకొండి . మేలుకోండి. మీ కుటుంబాలని కాపాడుకోండి . గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ బిగ్ బాస్ ని చూస్తారా? బిగ్ బాస్ హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా, అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు. చూస్తారా? చూస్తారా? సగటు భారతీయుడు బాధతో..

– సంపత్‌రాజు

Leave a Reply