ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
సెప్టెంబర్ 22 నుండి 28 వరకు మహాకవి గుర్రం జాషువా జయంతి వారోత్సవాలు గుంటూరులో జరుగుతాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ వెల్లడించారు బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో మహాకవి గుర్రం జాషువా 127 వ జయంతి వారోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహాకవి జాషువా 127 వ జయంతి వారోత్సవాలలో భాగంగా మొదటి రోజైన 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం లోని అన్నమయ్య కళావేదికలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు జాషువా పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23న జాషువా జీవితం, సాహిత్యం పై, సెప్టెంబర్ 24న జాషువా సాహిత్య, సామాజిక సంస్కరణ పై, 25న దళిత లిటరరీ ఫెస్టివల్, 26న మహాకవి గుర్రం జాషువా కు గుంటూరు కవుల నివాళి, 27న సిపిఎం ఆధ్వర్యంలో, 28న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయంతి వారోత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు ఈ జయంతి వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గడ్డం ఎలీషా, హైకోర్టు న్యాయవాది, శావల బాలస్వామి,రిటైర్డ్ డీఐజి, కొరివి వినాయకుమార్, డిబిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, జాషువా జయంతి వారోత్సవాల కమిటీ సభ్యులు, జాషువా అభిమానులు, మాదిగ జనసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు రాజకీయ ప్రయోజనాలే టిడిపి పరమావధి
రాజకీయ లబ్ధి కోసమే రాజధాని రైతులను టిడిపి ఉసి గొల్పుతోందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ తాడికొండ అదనపు సమన్వయకర్త డొక్కా మాణిక్య వరప్రసాద్.
రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ రాజధాని రైతులను పాదయాత్ర పేరుతో ఉసి గొల్పుతోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ తాడికొండ వైసిపి అదనపు సమన్వయకర్త డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. బుధవారం గుంటూరు లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు ఈ విషయం తెలుసుకున్న టిడిపి కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని రైతులను ఉసి గొల్పి తన పబ్బం గడుపు ఉంటుందన్నారు.
రైతుల పేరుతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు టిడిపి చేయిస్తుందని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రతినిధిగా రైతుల ప్రయోజనాల కోసం రైతులతో చర్చించేందుకు మనం ఎక్కడికైనా వస్తానని స్పష్టం చేశారు. రాజధాని రైతుల భూములు పెంపు కోసం ప్రభుత్వం మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తానంటే టిడిపి వ్యతిరేకిస్తోందని తెలిపారు మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే రైతుల భూముల విలువ పెరిగి రైతులు తమ ప్రభావం నుంచి వెళ్లిపోతారని టిడిపి మున్సిపాలిటీని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు టిడిపి ప్రభావంలో పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ వైయస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు.