Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉంది: సోమువీర్రాజు

శాసనసభలో ముఖ్యమంత్రి రాజాధాని పై స్పందించిన తీరు ను బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలపై అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఆక్షేపించారు.

అమరావతి రాజధాని కి ఆంధ్రప్రదేశ్ బిజెపి కట్టుబడి ఉంది. పార్లమెంట్, న్యాయ స్థానాలవంటి పదాలు అసెంబ్లీలో వినియోగించి వికేంద్రీకరణ పాఠ పాడడం దారుణం.కర్నూలు హైకోర్టు బిజెపి కోరుకుంది అంటే అది రాజధాని కాదు.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారు.అమరావతి రాజధాని కేంద్రం గా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది.ఈవాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలి.

కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి పై శ్వేపత్రం విడుదల చేయగలం. మీరు బ్లాక్ పేపర్ విడుదల చేయగలరు అంటూ సోమువీర్రాజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు పై విరుచుకు పడ్డారు.

LEAVE A RESPONSE