Suryaa.co.in

Telangana

మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా బీజేపీ విమోచన దినం

– మేధావులందరూ ఖండించాలి
– ప్రజాసంఘాల ధ్వజం

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీనమా?- విమోచనమా?. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఏంటి? అనే అంశంపై ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గురువారం కొనసాగగా పలువురు ప్రజాసంఘాల నేతలు, ఎమ్మేల్యేలు పాల్గొని మాచ్లాడారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రొఫెసర్లు. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు, ఓయూ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్17 రజాకార్ వ్యతిరేక ఉద్యమం : ఎమ్మెల్యే దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు
సెప్టెంబర్17 రజాకార్ వ్యతిరేక ఉద్యమం. సమర యోధుల పోరాటాలను స్మరించుకునే దినోత్సవం.. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నది. ప్రతి ఒక్కరూ ఖండించాలి. నాటి దేశ ద్రోహులే నేడు దేశ భక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు.. భావితరాలకు వాస్తవాలను తెలియజేయాలి. ప్రజా సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలి.
అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరుపెట్టాలని సీఎం కేసీఅర్ తీర్మానించడం గొప్ప విషయం. మంచి ఆలోచన. అంబేద్కర్ కు గొప్ప నివాళి. దీనిపై ప్రజాసంఘాలు మరింత బలంగా ముందుకు తీసికుపోవాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.

ఆపరేషన్ పోలోకు అర్ ఎసెస్కు సంబంధం లేదు : రాజారామ్ యాదవ్
చరిత్రలో సెప్టెంబర్ 17కి ప్రాముఖ్యత లేదు.. ఆపరేషన్ పోలోకు అర్ ఎసెస్కు సంబంధం లేదు.. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణగదొక్కడం కోసమే నాటి పోలీస్ చర్య.. కానీ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నారు. మతరంగు పులుముతూ రాజకీయ లభ్దిని పొందాలని చూస్తున్నది. దీనిని మేధావులు ముక్త కంఠంతొ ఖండించాలి. మానిన గాయాలను మళ్లీ రేపుతున్నది. విలీనం కాదు.. విమోచనం కాదు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమే అసలైన తెలంగాణ విమోచన దినం.. తెలంగాణ పోరాటంలో.. స్వతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర శూన్యం.. అభివృద్ధి ఎజెండా లేకుండా కేవలం మతప్రాతిపదికన పాలన సాగిస్తున్నది బీజేపీ.. ఇది తెలంగాణకు, దేశానికి ప్రమాదకరం..

LEAVE A RESPONSE