– కార్గిల్ యుద్ధంలో ఎక్కువ త్యాగాలు చేసింది మా హిమాచల్ ప్రదేశ్ సైనికులే
– టెలికాం సాంకేతికత నుంచి టెక్నాలజీ వరకు.. వాజ్ పేయి చలవే
– దీన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారు
– మోదీ కేవలం భారతీయులకే నేత కాదు.. యావత్ ప్రపంచానికి నేత
అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
హైదరాబాద్: అటల్ జీ జీవితం ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రారంభమై.. మంచి రచయితగా, కవిగా, ప్రజలను సమ్మోహన పరిచే వక్తగా.. రాజనీతిజ్ఞుడిగా,ప్రధానమంత్రిగా.. బాధ్యతగల భారతీయుడిగా.. ఇలా బాధ్యతలు తీసుకున్న ప్రతి చోటా తన ముద్ర వేశారు.
వారు అస్తమించిన తర్వాత ఏయిమ్స్ నుంచి ఇంటి వరకు.. అక్కడినుంచి ‘సదైవ అటల్’ వరకు బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలతోపాటుగా వేలాదిమంది జనం అభిమానంతో నడిచారు. ఇది వారి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి, గౌరవానికి నిదర్శనం.
స్వర్గీయ నరసింహారావు తో వాజ్ పేయి కి ఉన్న పరస్పర గౌరవం వెలకట్టలేనిది. మా పార్టీ కూడా నరసింహారావు ని అంతే గౌరవ భావంతో గౌరవించుకుంది. కాంగ్రెస్ పార్టీ.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను హత్యచేసింది. మా పార్టీ, వాజ్ పేయి .. నిరంతరం ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పనిచేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కి భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుంటే.. మా పార్టీ అంబేడ్కర్ ని గౌరవించుకుంది. ఇప్పటికీ అధికార, విపక్షాల సీనియర్ నాయకులు వాజ్ పేయి ని గౌరవించేందుకు కారణం వారి వ్యక్తిత్వం. 1998 నుంచి నేటి వరకు ఎన్డీయే ధర్మాన్ని మేం నిర్వర్తించాం. నిర్వర్తిస్తూనే ఉన్నాం. కార్గిల్ యుద్ధంలో ఎక్కువ త్యాగాలు చేసింది మా హిమాచల్ ప్రదేశ్ సైనికులే. 4గురికి పరమవీర చక్ర అవార్డులు వస్తే అందులో ఇద్దరు మా హిమాచల్ వారే.
కార్గిల్ యుద్ధ సమయంలో నరేంద్రమోదీ కార్గిల్ కు వెళ్లినపుడు.. సైనికులు.. భారత్ మాతాకీ జై, అటల్ బిహారీ వాజ్ పేయి కి జై అని నినాదాలు చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఇందుకు కారణం.. యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి చేస్తే.. వాజ్ పేయి.. మీరు.. వెనక్కు తగ్గేది లేదని, నా భూభాగాన్ని ఒక్క ఇంచుకూడా వదిలేది లేదని చెప్పారు. ఇది సైనికుల్లో స్థైర్యాన్ని నింపింది.
సైనికులు యుద్ధానికి వెళ్తే.. వారి ట్రంకు పెట్టే మాత్రమే వెనక్కు వచ్చేది. కానీ యుద్ధంలో అమరులైన సైనికుల పార్థివదేహాలను గౌరవప్రదంగా వారి కుటుంబాలకు చేర్చారు.
వాజ్ పేయి స్వప్నమైన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను మోదీ నెరవేర్చారు. 1997లో భారతదేశం స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో.. విదేశాల్లో మనల్ని బిచ్చగాళ్లు, పాములు పట్టుకునే వాళ్లని అవహేళన చేశారు. చాలా బాధనిపించింది.
కానీ రెండేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారింది. వాజ్ పేయి నేతృత్వంలో ఎన్డీయేప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారతదేశం అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొంది, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మన దేశాన్ని విమర్శించిన అంతర్జాతీయ పత్రికలే.. గొప్పదనాన్ని కీర్తిస్తూ వ్యాసాలు రాశాయి. అదీ.. సమర్థవంతమైన నాయకుడి నేతృత్వంలో, దేశం ఎలా ఉంటుందనడానికి ఉదాహరణ.
సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం ముందుకెళ్లేందుకు.. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదాన్ని వాజ్ పేయి తీసుకొచ్చారు. టెలికాం సాంకేతికత నుంచి టెక్నాలజీ వరకు.. వాజ్ పేయి చలవే. దీన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానించారు. సర్వశిక్షా అభియాన్ తో.. పాఠశాల పిల్లలకు భవనాలు, బెంచీలు అందించేందుకు కృషిచేశారు. అందుకే బీజేపీ అంటే.. సుపరిపాలన.
370 ఆర్టికల్ తొలగించాలి.. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండొద్దని మా అగ్రనేతలు శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ, వాజ్ పేయి సంకల్పిస్తే.. మోదీ దాన్ని పూర్తిచేశారు. మనమంతా కలిసి వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి. భవిష్యత్ తరాలకు ఆయన జీవిత విలువలను తెలియజేయాలి.
ఇవాళ మోదీ కేవలం భారతీయులకే నేత కాదు.. యావత్ ప్రపంచానికి నేత. అటల్ జీ స్వప్నాన్ని.. మోదీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో మనమంతా కార్యకర్తలుగా కష్టపడి పనిచేస్తూ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే విషయంలో భాగస్వాములమైదాం. తెలంగాణలో వాజ్ పేయి వెళ్లిన ప్రతిచోటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిద్దాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నాడు అమలైన చోట్ల కార్యక్రమాలు నిర్వహిద్దాం. మనమంతా కలిసి పనిచేద్దాం.