– కేటీఆర్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో చికిత్స చేయించుకోవాలి
– సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఆట మొదలు పెట్టలేదు
– కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కి పాలన చేతకావడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్న. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గుండు సున్నా చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి బీఆర్ఎస్ ను మూడో స్థానానికి పరిమితం చేశారు.
హైదరాబాద్ కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెట్రో ను నగరం నలువైపులా విస్తరిస్తున్నాం.జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తోంది. కేసీఆర్ కుటుంబం క్రిమినల్స్ తరహాలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజలు మరిచిపోతారన్న భయంతోనే బీఆర్ఎస్ మీడియాలో హడావిడి చేస్తోంది.
ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ తో కేటీఆర్ కు మతిభ్రమించినట్లుంది. కేటీఆర్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో చికిత్స చేయించుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నడిరోడ్డుపై హత్యలు జరిగాయి. పాతబస్తీలో నెల రోజుల పాటు కర్య్ఫూ పెట్టిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది. హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్ర లపై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్న.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కోవర్ట్. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కు కమిషన్లు ఎలా తీసుకోవాలో తెలుసు. అవినీతి చేస్తున్నాడని దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పైన బట్ట కాల్చి మీదేస్తున్నారు. ఈటెల రాజేందర్ అసహనం గా ఉన్నారు.రియల్టర్ల పైన వీధి రౌడీలా ఈటల రాజేందర్ వ్యవహరించారు.సమస్య ఉంటే ఈటెల రాజేందర్ చట్టపరంగా ఫిర్యాదు చేయాలి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే కేటీఆర్ హడావిడి చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే భయం బీఆర్ఎస్ కు పట్టుకుంది. ఎవరి ఇంట్లో కేటీఆర్ సమావేశం పెట్టాడో ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు. పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఆట మొదలు పెట్టలేదు. జీహెచ్ఎంసీ మేయర్ పైన బీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుందో మీరే చూస్తారు.