– మానవత్వానికి మారుపేరైన మన కేసీఆర్ ఆలోచనలో పుట్టిందే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు
– బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్
ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం
హైదరాబాద్ : BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ నియోజకవర్గం, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు , డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు అలాగే లక్ష్మణ్ , రమేష్ , నాగేశ్వర్ రావు , వినయ్ , కళ్యాణ్ ,శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. రాజకీయాలంటే ఈ మధ్య ఓ ఒరవడిలా తయారైంది. ప్రజలు.. ప్రజలు కాదు ఓట్లేసే యంత్రాలు..కార్యకర్తలు నాయకుల యొక్క పల్లకీలు మోసే వారులా కొన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మానవత్వానికి మారుపేరైన మన కేసీఆర్ ఆలోచనలో పుట్టిందే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఈ సమ్మేళన కార్యక్రమంలో అన్నదమ్ముల్లాగా..అక్క చెల్లెళ్లుగా..కలిసి మెలిసి ఉండాలని , కష్ట సుఖాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. మరో ఏడు , ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి..ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మనపై చాల బాధ్యతలు పెట్టారని , అనేక కార్యక్రమాలు చేపట్టారని కార్యకర్తలకు గుర్తు చేసారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంటే.. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం చంద్రుడు ఫై మచ్చను వెతికినట్లు , బిఆర్ఎస్ పార్టీ ఫై , సీఎం కేసీఆర్ గారి ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. వారి విమర్శలకు , తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. రైతు బంధు , దళిత బందు , కేసీఆర్ కిట్ , కల్యాణ లక్ష్మి ఇలా ఎన్నో పధకాలను ప్రజలకు కేసీఆర్ గారు అందించారని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని పార్టీలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా..కేసీఆర్ ఫై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చుస్తున్నారని..అలాంటి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ కండువా కప్పుకున్న నేతలు , కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరు కేసీఆర్ ని మూడో సారి ముఖ్యమంత్రి గా చూడాలనుకుంటే..కేటీఆర్ నేతృత్వం లో హైదరాబాద్ ను ఇంకా అభివృద్ధి పధంలో చూడాలనుకుంటే.. సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసి ..మీరు కేసీఆర్ దగ్గరి నుండి ఏలబ్ధి పొందారో..ఎలాంటి సంక్షేమ పధకాలు అందుకున్నారో తెలియజేయండి అని శ్రవణ్ ఆదేశించారు. బీజేపీ , కాంగ్రెస్ పార్టీల తప్పుడు ప్రచారానికి రివర్స్ లో మీరు కేసీఆర్ దగ్గరినుండి ఏం పొందారో తెలియజేయండని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఎంతగా కష్టపడ్డారో తెలియంది కాదు..ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడి..ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి..ఈనాడు బలవంతమైన నాయకుడిగా ఎదిగారని గుర్తు చేసారు డా. దాసోజు శ్రావణ్ . ఆనాడు 60 వేల కోట్ల బడ్జెట్ ను ఈనాడు 3 లక్షల కోట్ల బడ్జెట్ గా చేర్చిన మహానేత కేసీఆర్ గారు. రూ.500 పెన్షన్ ను కాస్త రూ. 2000 అందిస్తున్న ఘనుడు సీఎం కేసీఆర్ . రాష్ట్రంలో ఎన్నో స్కిం లు , పధకాలు తీసుకొచ్చిన నేత కేసీఆర్ గారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదన్నారు.
ఈరోజు రైతు బంధు , దళిత బందు , కేసీఆర్ కిట్ , కల్యాణ లక్ష్మి, హైదరాబాద్ కు భారీ పెట్టుబడులు , బస్తి దవాఖాన ఇలా ఇన్ని వచ్చాయంటే వాటిన్నిటికి కారణం కేసీఆర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు తెలంగాణ రావొద్దని చాలామంది ట్రై చేసారు. తెలంగాణ వస్తే నీటికి ఇబ్బంది వస్తుందని , హైదరాబాద్ అభివృద్ధి జరగదని , తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడతారని, తెలంగాణ వస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయని ప్రచారం చేసారని గుర్తుచేశారు. కానీ ఈరోజు తెలంగాణ ఎంతగా అభివృద్ధి జరుగుతుందో..ఎన్నిన్నొ పరిశ్రమలు తెలంగాణ కు వస్తున్నాయని , లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, నీటి కష్టాలు పోయాయని , పంటలు బాగా పండుతున్నాయి , 24 గంటలు కరెంట్ ఉంటుంది..పక్క రాష్ట్రాలు సైతం తెలంగాణ అభివృద్ధి చూసి ఈర్ష పడే స్థాయికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారని మరోసారి గుర్తుచేశారు దాసోజు శ్రవణ్ . ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి గురించి వాడ..వాడ లకు వెళ్లి తెలియజేయాలని , బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.