– బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం
గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మరోమారు తెగబడిందని ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయం తగ్గిపోయి కుదేలవుతున్న ప్రజలకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇస్తోందని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు .తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని పాదయాత్రలో పదే పదే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదేళ్ల క్రితం నాటి ఖర్చుల వ్యత్యానం వసూళ్ల కోవం మడమ తిప్పారని ఎద్దేవా చేశారు.సామాన్యుడు నెత్తిమీద ప్రతినెల అదనపు ఆర్ధిక భారం నెడుతున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలకు కరెంటు బిల్లులకు లింకు పెట్టిన నేపధ్యంలో ఈ అదనపు భారం వల్ల ఫించన్లు కోల్పోతామన్న భయంతో లబ్ధిదారులు ఉన్నారని, వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు?
ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక పోతే ముఖ్యమంత్రి ద్వంద విధానాలు అమలు చేస్తు రాయితీలు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయడానికి వెనుక నుండి గోతులు తవ్వుతున్నట్లుగా భావించాల్సి వస్తుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారుఏపాపం ఎరగని వారిపై పిడుగుపాటుగా ఈ ఆర్ధిక భారం నెడుతూ ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.వచ్చే ఏడాది మార్చి వరకు కూడా ఈఅదనపు భారంపడే పరిస్థితి ఉంది. సుమారుగా రూ.3,800 కోట్లు వరకు సర్ధుబాటులో భాగంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇల్లు ఈ భారం మోయాల్సిందేఅన్నట్లు ప్రభుత్వ విధానంగా కనపడుతోందని, 2019-20 విద్యుత్ టారిఫ్ లో అనుమతించిన వ్యయానికి వాస్తవ ఖర్చులకు మద్య వ్యత్యాసం 2,542 కోట్లు గా ట్రూ ఆప్ పిటిషన్ ను విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేశాయన్నారు.
అయితే విద్యుత్ నియంత్రణ మండలి ( ఇఆర్సి) అనుమతి ఇస్తే ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే సర్దుబాటు పేరుతో 2,542 కొట్లు కట్టించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్దం అవుతాయని,వాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని భారతీయజనతాపార్టీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.ఇప్పటికే అనుమతించిన 3,800 కోట్లు ట్రూ ఆప్ నకు సంబంధించి ఈ నెల బిల్లు నుండి వచ్చే మార్చి వరకు వినియోగదారుల పై భారం పడుతోందని, తిరిగి పంపిణీ సంస్థలు అదే విధానం అమలు చేసే ప్రయత్నం దారుణమని దీనిని తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.
విద్యుత్ మీటర్ కలిగిన వినియోగదారుడు అతిసామాన్యుడైనా రూ. 200 నుండి రూ. 300 రూపాయల వరకు అదనపు భారం చెల్లించాల్సి వస్తోందని, విద్యుత్ పంపిణీ సంస్థల వైఫల్యాలకు ప్రజలు ఎలా భాద్యత వహిస్తారని ? ఇది సంస్థ చేతకాని తనానికి వినియెగ దారులు ఎందుకు ఆర్ధిక భారాన్ని భరించాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.విద్యుత్ వినిమయం తగ్గినా ఇతర కారణాలు చూపిస్తు విద్యుత్ సంస్థలు మరోసారి ఈ అదనపు వ్యయాన్ని సామాన్యుని పై రుద్దేందుకు ప్రణాళికలు రచిస్తుండగా ప్రభుత్వం అదనుపు వ్యయం వసూలు చేసేందుకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వ తీరుని భాజపా తప్పు పడుతోందన్నారు.ఇప్పటికైనా విద్యుత్ సంస్థలు సర్దుబాటు పేరుతో అదనంగా విధుస్తున్న ఆర్ధిక భారాన్ని ప్రభుత్వమే భరించాలి, వినియోగదారులపై ఈ ఆర్ధిక భారం వేయడాన్ని బిజెపి వ్యతిరేకిస్తుందని తీవ్రంగా దుయ్యబట్టారు.