Suryaa.co.in

Telangana

బీజేపీ రాష్ట్రాలు సరే.. తెలంగాణ భద్రత గురించి స్పందించండి మేడమ్‌!

– స్మిత సభర్వాల్‌కు వీహీచ్‌పీ నేత సూచన

“ఆకాశం పై ఉమ్మేస్తే అది వచ్చి మన ముఖంపైనే పడుతుంది” అనే సామెత ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. తన ట్విట్టర్ ద్వారా బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగే అత్యాచారాల విషయంలో రాజకీయ నాయకులను మించి విమర్శలు గుప్పించే ఓ కీలక అధికారికీ.. తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న తీరు కళ్ళకు కట్టింది.

ముఖ్యమంత్రి కార్యాలయ అధికారికే ఇంతటి ఘోరమైన భద్రత వైఫల్యం కనిపించింది. ప్రముఖమైన హోదా గల ఓ మహిళా అధికారి ఇంటికి అర్ధరాత్రి వేళ నేరుగా వెళ్లి, ఓ దుండగుడు సరాసరి నట్టింట్లో చొరపడ్డాడు అంటే మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి సెక్యూరిటీ ఉందో తెలుసుకోవచ్చు.! బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలపై జరిగే అత్యాచారాల గురించి ట్విట్టర్ ద్వారా స్పందించే ఈ అధికారి.. ఈ విషయంలో కూడా తెలంగాణ భద్రత వైఫల్యం పై స్పందిస్తే బాగుండు.

అసలు విషయం ఏమిటంటే నిరంతరం బిజెపిని నిందిస్తూ ట్వీట్లు చేసే ఆ అధికారికి మద్దతుగా మరో వ్యక్తి రీ ట్వీట్ చేయడం.. స్నేహం ఏర్పడింది అంటూ సదరు వ్యక్తి చెప్పడం మరో విశేషం. పరిపాలన విషయం వదిలి.. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక విషయాలపై స్పందించే అధికారికి ఇది గుణపాఠం అనుకోవచ్చేమో..! ఈ విషయంలో ఆ అధికారి ప్రభుత్వ భద్రత వైఫల్యం గురించి స్పందించకుండా.. “స్వీయ రక్షణ.. రాత్రివేళ తలుపులు బాగా బిగించుకోవాలి.. బాధాకరమైన ఘటన.. భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా..” అంటూ ట్వీట్ చేయడం సరి కాదు.!

“తెలంగాణ ప్రభుత్వం మహిళలపై చూపుతున్న వివక్ష.. పోలీసుల అసమర్ధత అనే వాస్తవ విషయం ట్వీట్ చేస్తే సరిపోతుంది.” అని తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. “చెడపకురా చెడేవు” అని పెద్దలు చెప్పారు.

పగుడాకుల బాలస్వామి
విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ ప్రచార ప్రముఖ్‌

LEAVE A RESPONSE