– రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు
తిరుపతి: తిరుపతిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. హథీరాంజీ మఠంలో జరుగుతున్న బర్సీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ పై జరుగుతున్న బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాలి.. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ లు రెండూ దోచుకునే పార్టీలు. అవినీతి రహిత పార్టీ బీజేపీ. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మేమే గెలుస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. రానున్న ప్రధాన ఎన్నికల్లోను బీజేపీ విజయం ఖాయం.
తిరుపతిలోని హథీరాంజీ మఠాన్ని ఆస్తిగా చూడొద్దండి. హిందూ మతానికి, సంస్కృతికి వారసత్వ సంపద హథీరాంజీ మఠం. మతమార్పిడులను నివారించాలంటే హథీరాంజీలాంటి హిందూ సంస్థలను, ఆస్తులను పరిరక్షించాలి. ఇదిలావుండగా, రామ్ చందర్ రావు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివిధ అంశాలపై చర్చించుకున్నారు.