Suryaa.co.in

Telangana

బిజెపికి మత రాజకీయాలే ఎజెండా

-ఎన్నికల్లో గెలుపు ఇండియా కూటమిదే
-మోడీ అబద్దాలకోరు
-పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ధరంకోట్ : హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప బిజెపికి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఆరోపించారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సమావేశాల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడింది దానికి అనుగుణంగానే పోరాడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వివరించారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా మిగిలిన వాళ్లంతా పేదవారిగా మిగిలిపోవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. బిజెపి మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుంది.

అప్పుడు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు, ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ముందంజలో ఉందని అన్నారు. గత పది ఏళ్లలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిని నెరవేర్చలేదు అందుకే ఈసారి ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారని తెలిపారు. మోడీ పెద్ద అబద్దాలకోరు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లోరూ. 15 లక్షలు జమ చేస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు.

LEAVE A RESPONSE