Suryaa.co.in

Andhra Pradesh

ఎలుకలే పిల్లిని తరిమినట్లుంది

– పిన్నెల్లి పరారీపై మాజీ ఐఏఎస్ పివి రమేష్ వ్యంగ్యాస్త్రం

పోలింగ్ బూత్‌లోకి దౌర్జన్యంగా అనుచరులతో ప్రవేశించి ఈవీఎంను పగులకొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇప్పటిదాకా కనిపించని వైనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఆ సామాజికవర్గానికే చెందిన, ముగ్గురు ఐపిఎస్ అధికారులే కాపాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్, జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు, డాక్టర్ పివి రమేష్ ఈ ఘటనపై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలీసు-రెవిన్యూ అధికారుల పనితీరు చూస్తుంటే ఎలుకే పిల్లిని తరిమినట్లుంద’’ని ఎద్దేవా చేశారు. పివి రమేష్ తన ట్వీట్‌లో ఏమన్నారనంటే…

“ఏపీలో కొంత మంది అధికారులు 24 గంటలూ ఎమ్మెల్యే సేవలో తరిస్తున్నారు. లంచాల ముందు బాధ్యతలు చిన్నబోతున్నాయి. పోలింగ్ రోజు అంగ, అర్ధ బలమే పని చేసింది.అధికారులు బాధ్యత మరిచి ఎమ్మెల్యేకు సలాం చేశారు. రాజ్యాధిపత్య జాడ్యం క్యాన్సర్‌లా పాకిపోతోంది. ప్రశ్నిద్దామన్నా.. మాఫియా రాజ్యంలో ఆ ధైర్యం చేసేదెవరు? ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం” అని పోస్టులో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE