Home » జగన్ పై సినిమా తీయాల్సి వస్తే ‘అవినీతి రత్న’ అని పెట్టి తీస్తే బాగుంటుంది

జగన్ పై సినిమా తీయాల్సి వస్తే ‘అవినీతి రత్న’ అని పెట్టి తీస్తే బాగుంటుంది

– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

జగన్ పై సినిమా తీయాల్సి వస్తే ‘అవినీతి రత్న’ అని పెట్టి తీస్తే బాగుంటుందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..జగన్ పేదల పెన్నిధి అనిసిగ్గు, ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్ లు పెట్టి వైసీపీ మంత్రులు చెప్పడం అవివేకం. వైసీపీ మంత్రులు చెప్పినట్లు జగన్ పేదల పెన్నిధి కాదు పేదల ద్రోహి. చంద్రన్నే పేదల పెన్నిధి అని ఘంటాపథకంగా చెప్పొచ్చు.

జగన్ కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు. జగన్ పేదల ద్రోహి అని స్వయంగా ప్రజలే అంటున్నారు. చంద్రన్న అన్నా క్యాంటిన్ లను పెడితే జగన్ వాటిరని రద్దు చేశారు. సంక్షేమాన్ని రద్దు చేసినవారు పేదల పెన్నిధి ఎలా అవుతారు? సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసినవారు పేదల పెన్నిధి ఎలా అవుతారు? చంద్రన్న చరిత్రలో తొలిసారిగా మత్స్యకారులకు, చేనేతలకు, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారు. చంద్రన్న హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు.

ఏ ఇతర పథకం వస్తున్నా.. వృద్ధాప్య పెన్షన్ రద్దయ్యే విధంగా జగన్ ప్రభుత్వం చేసింది. చంద్రబాబునాయుడు 15 లక్షల టిడ్కో ఇళ్లు కట్టి 11 లక్షల ఇళ్లను పంపిణీ చేశారు. మిగిలిన రెండున్నర లక్షల టిడ్కో ఇళ్లను ఎన్నికల దృష్ట్యా పంచలేకపోయారు. వైసీపీ రాగానే 2లక్షల 62 వేల ఇళ్లు పంచాల్సివుండగా పంచలేదు. ఇంతవరకు ఒక్కరికి కూడా టిడ్కో ఇంటిని ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం పేదల పెన్నిధి ఎలా అవుతుంది? ఆనాడు చంద్రన్న ఇసుకను ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ నాయకులే సిండికేట్ గా ఏర్పడి ఇసుకను దోపిడీ చేస్తుంటే గోడు ఎవరికి చెప్పుకోవాలి.

చంద్రన్న ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే బిడ్డలకు ఆనాడు చంద్రన్న ప్రభుత్వం బేబీ కిట్స్, తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ లో క్షేమంగా ఇంటికి తరలింపు కార్యక్రమాలు పెట్టిన విషయం అందరికీ తెలుసు. కమీషన్ల కోసం ఈ వైసీపీ ప్రభుత్వం ఏకంగా పేదల పథకాలను రద్దు చేశారు.

పేద బ్రాహ్మణులకు చంద్రన్న ప్రభుత్వం 20 పథకాలతో సంక్షేమాన్ని తెస్తే వైసీపీ అన్నీ రద్దు చేసేశారు. అలాంటప్పుడు వైసీపీ పేదల ప్రభుత్వం ఎలా అవుతుంది? చంద్రబాబునాయుడు 4,520 మందికి విదేశీ విద్యను అందించారు. 4 లక్షల మందికి 3,600 కోట్ల రుణాలు ఆనాడు చంద్రన్న ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లన్నింటిని నిర్వీర్యం చేశారు. బీసీలకు ఆనాడు చంద్రన్న పభుత్వం ఆదరణ పథకం ద్వారా 964 కోట్లతో 4 లక్షల మందికి పనిముట్లనిచ్చింది. కార్యాలయాలు నిర్మిస్తామని చెప్పి దళితుల అసైన్డ్ భూమిని లాక్కొనే ప్రయత్నం చేస్తే ఆ దిళితుడు ఏం చేయాలో పాలుపోక ఆ కుటుంబం రోడ్డున పడింది.

సామాన్య ప్రజలు జగన్ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. వీల్ ఛైర్ లో సీఎం ను కలవడానికి సీఎం ఇంటికి వచ్చిన సుధారాణి ఆమె కుమారులు, కుమార్తెలను పోలీసులు బలవంతంగా జీపులో తీసుకెళ్లిపోయారు. చెప్పుకోవడానికే సిగ్గుచేటు. సీఎం సొంత జిల్లాలోని పులపుత్తూరులో వరద బాధితులు సీఎం కలవడానికి ప్రయత్నిస్తే రాకుండా తాడు కట్టేశారు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

కురబలకోట ముదివేడులో పేదలు తమ బతుకుదెరువు కోసం నిర్మించుకున్న 92 చిన్న చిన్న దుకాణాలని నిర్దాక్షిణంగా తీసేసి జీవనోపాధి లేకుండా చేశారు. విజయనగరంలో కూడా ఇదే పరిస్థితి. గుంటూరు చంద్రయ్య నగర్ లో పేద ప్రజల ఇళ్లని ఈ విధంగానే కూల్చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే విధంగా చేసిన వారు పేదల పెన్నిధులా? అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధా ఘాటుగా ప్రశ్నించారు.

Leave a Reply